Singapore Saloon | నవ్వుల డ్రామా సింగపూర్ సెలూన్
నయనతార ప్రధాన పాత్రలో వచ్చిన ‘అమ్మోరు తల్లి’ సినిమాతో ఆర్జే బాలాజీ తెలుగులో ఓటీటీ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ చిత్రంలో అతని కామెడీ టైమింగ్‌కు చాలామంది అభిమానులు అయ్యారు.
సింగపూర్ సెలూన్ (తమిళం)
అమెజాన్ ప్రైమ్: ఫిబ్రవరి 23
నటీనటులు: ఆర్జే బాలాజీ, సత్యరాజ్, లాల్, మీనాక్షి చౌదరి
దర్శకత్వం: గోకుల్
Singapore Saloon | నయనతార ప్రధాన పాత్రలో వచ్చిన ‘అమ్మోరు తల్లి’ సినిమాతో ఆర్జే బాలాజీ తెలుగులో ఓటీటీ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ చిత్రంలో అతని కామెడీ టైమింగ్‌కు చాలామంది అభిమానులు అయ్యారు. తాజాగా బాలాజీ నటించిన ‘సింగపూర్ సెలూన్’ చిత్రం తమిళ వెర్షన్‌ను కూడా తెలుగు ప్రేక్షకులు చూస్తున్నారంటే.. ఓటీటీలో అతనికి ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. కథలోకి వెళ్తే.. కదిర్ (ఆర్జే బాలాజీ) తెన్‌కాశీలో ఉంటుంటాడు. చిన్నప్పటి నుంచి ‘సింగపూర్ సెలూన్’ నిర్వాహకుడు చాచా (లాల్) అంటే అతనికి ప్రాణం. ఆయన స్ఫూర్తితోనే పెద్దయ్యాక మంచి హెయిర్ స్టయిలిస్ట్ కావాలనుకుంటాడు. పట్నంలో ఇంటర్ పూర్తిచేసి ఊరికి వచ్చేసరికి చాచా సెలూన్ మూతబడుతుంది. అతను ఏమయ్యాడో తెలియదు.
ఈ పరిస్థితుల్లో ఇంజినీరింగ్‌లో సీటు వచ్చినా కాదనుకొని కటింగ్ షాపు పెడతానంటాడు. తండ్రి నచ్చజెప్పడంతో పంతం మాని ఇంజినీరింగ్‌లో చేరుతాడు. చదువు పూర్తయ్యాక ‘సింగపూర్ సెలూన్’ పేరుతో కార్పొరేట్ స్థాయిలో షాపు పెట్టాలనుకుంటాడు. ఈ క్రమంలో తన మామయ్య (సత్యరాజ్) దగ్గర అప్పు తీసుకుని చెన్నైలో ఓ భారీ మాల్లో దుకాణం తీసుకుంటాడు. అయితే, అనుకోని కారణాల వల్ల సెలూన్ తెరవలేకపోతాడు. తన లక్ష్యం నెరవేరే దారి లేకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. ఇంతకీ కదిర్ ఆత్మహత్య ప్రయత్నం విరమించుకున్నాడా? అకస్మాత్తుగా కనిపించకుండా పోయిన చాచా ఏమయ్యాడు? కదిర్ లక్ష్యం నెరవేరిందా, లేదా అన్నది మిగిలిన కథ!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MVSR Dandiya Event | ‘ఇది హిందువుల ఈవెంట్.. నువ్వెందుకు వచ్చావ్?’.. ఎంవీఎస్ఆర్ కాలేజీలో ముస్లిం బౌన్సర్‌ను నిలదీసిన యువకులు!
Ranabaali | బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘రణబాలి’.. 24 గంటల్లోనే 1.39 లక్షల టికెట్ల విక్రయం!
Cricketer Jehangir | అభిమానిని కిందపడేసి చితకబాదిన క్రికెటర్.. వీడియో వైరల్!
MBBS Student | హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని.. మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య
Jailer 2 | రజినీకాంత్ ‘జైలర్ 2’ సునామీ.. 5 రోజుల్లోనే రూ. 500 కోట్ల వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

