Rithu Varma | గ్లామర్ పాత్రలు చేస్తా!

‘గ్లామర్ రోల్స్ చేయకూడదనే నియమాలు పెట్టుకోలేదు. కథలో నా పాత్రకు ప్రాధాన్యముందనిపిస్తే గ్లామర్ పాత్రల్లో నటించడానికి సిద్ధంగా ఉన్నా’ అని చెప్పింది రీతూవర్మ. ఆమె కథానాయికగా నటించిన చిత్రం ‘టక్ జగదీష్’. నాని హీరోగా నటించారు. శివనిర్వాణ దర్శకత్వం వహించారు. ఈ నెల 10న అమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో రీతూవర్మ పాత్రికేయులతో పంచుకున్న ముచ్చట్లివి…
ప్రచార చిత్రాలు చూస్తుంటే గత చిత్రాలకు భిన్నంగా మీ పాత్ర కనిపిస్తోంది?
కెరీర్లో నేను చేసిన తొలి పూర్తిస్థాయి కమర్షియల్ సినిమా ఇది. ఇందులో గుమ్మడి వరలక్ష్మి అనే పల్లెటూరి యువతిగా కనిపిస్తా. ఆధిపత్యధోరణి, అమాయకత్వం కలబోసిన ప్రభుత్వ ఉద్యోగినిగా నా పాత్ర విభిన్నంగా ఉంటుంది. మనసులోని భావాల్ని నిర్మొహమాటంగా వెల్లడిస్తూ నిజం కోసం పోరాడే యువతిగా దర్శకుడు శివనిర్వాణ వినూత్నంగా నా క్యారెక్టర్‌ను తీర్చిదిద్దారు.
సుదీర్ఘ విరామం తర్వాత నానితో మరోసారి కలిసి సినిమా చేయడం ఎలాంటి అనుభూతిని పంచింది?
‘ఎవడే సుబ్రహ్మణ్యం’ తర్వాత నాని, నేను కలిసి నటించిన సినిమా ఇది. తొలి సినిమా సమయంలో నేను ఇండస్ట్రీకి కొత్త కావడంలో నానితో పెద్దగా మాట్లాడే అవకాశం దొరకలేదు. ఈ సినిమా ద్వారా అతడితో చక్కటి అనుబంధం ఏర్పడింది. సినిమాలు, జీవితంతో పాటు అన్ని అంశాలపై నానికి అపారమైన పరిజ్ఞానం ఉంది. షూటింగ్ సమయంలో చాలా విషయాల్ని ఆయన మాతో పంచుకున్నారు. ప్రస్తుతం సినిమాల పరంగా నాకు ఏమైనా అనుమానాలుంటే నాని సలహాలు స్వీకరిస్తా.
సినిమాల ఎంపికలో సెలెక్టివ్‌గా ఉంటున్నారు?ఎందుకలా?
ఎనిమిదేళ్ల ప్రయాణంలో తక్కువ సినిమాలు చేశాననే అసంతృప్తి లేదు. ఎక్కువ సినిమాలు చేయాలని తొందరపడటం లేదు. కొత్తదనం ఉంటూ నాలో ఆసక్తిని రేకెత్తించిన కథలను మాత్రమే అంగీకరించాలని సినీ పరిశ్రమలో అడుగుపెట్టే సమయంలోనే నిర్ణయించుకున్నా. ‘పెళ్లిచూపులు’ చిత్రానికి ముందు కోరుకున్న పాత్రలు దొరకలేదు. ఇప్పుడిప్పుడే కెరీర్లో మంచి కథల్ని ఎంచుకునే స్వేచ్ఛ లభిస్తోంది. అది అదృష్టంగా భావిస్తున్నా.
తదుపరి సినిమా విశేషాలేమిటి?
నాగశౌర్యతో కలిసి నటించిన ‘వరుడు కావలెను’ అక్టోబర్‌లో విడుదలకానుంది. శర్వానంద్‌తో ‘ఒకే ఒక జీవితం’ పేరుతో ఓ ద్విభాషా చిత్రం చేస్తున్నా. భవిష్యత్తులో మంచి కథలు దొరికితే చిత్రనిర్మాణాన్ని చేపడతా. అంథాలజీ కథాంశంతో తెరకెక్కనున్న వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

