సరికొత్త ప్రపంచంలో విహరిస్తారు
‘మత్తు వదలరా’ చిత్రంతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా గుర్తింపును సంపాదించుకున్నారు రితేష్ రానా. థ్ల్రిల్లర్ కథాంశానికి చక్కటి వినోదాన్ని జోడించి ప్రేక్షకుల్ని మెప్పించారు. ఆయన దర్శకత్వంలో రూపొందించిన తాజా చిత్రం ‘హ్యాపీ బర్త్‌డే’. లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించారు. ఈ నెల 8న విడుదలకానుంది. ఈ సందర్భంగా రితేష్ రానా శనివారం పాత్రికేయులతో ముచ్చటించారు.
‘హ్యాపీ బర్త్‌డే’ సినిమా కాన్సెప్ట్‌లో కొత్తదనమేమిటి?
హాలీవుడ్లో పాపులర్ అయిన సర్రియల్ కామెడీ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించాం. తెలుగులో ఇప్పటి వరకు ఈ జోనర్లో సినిమా రాలేదు. మన చట్టాల ప్రకారం గన్స్ అందరూ ఉపయోగించ లేరు. అందుకే ఓ ఊహాజనిత ప్రపంచాన్ని సృష్టించి..అందులో కథ నడిపాం. సర్రియల్ వరల్డ్‌లో కథ నడుస్తున్నా..ప్రతి సన్నివేశం లాజికల్‌గానే ఉంటుంది.
ఈ సినిమా తీయడానికి ఏమైనా హాలీవుడ్ చిత్రాన్ని ప్రేరణగా తీసుకున్నారా?
క్వెంటిన్ టరన్టీనో ‘పల్ప్ ఫిక్షన్’ తరహాలో నాన్ లీనియర్ స్క్రీన్‌ప్లే ఉంటుంది. ఏడు చాప్టర్స్‌లో కథ నడుస్తుంది. ఒక్కో చాప్టర్లో వ్యంగ్యం, పేరడీ, విజువల్ కామెడీ..ఇలా విభిన్న తరహా కామెడీ అంశాల్ని టచ్ చేశాం.
ట్రైలర్ ఇంట్రెస్టింగ్ ఉంది..కానీ కథ గురించి ఎలాంటి హింట్ ఇవ్వలేదు..?
ఈ కథ జరిగే ఊహాజనిత ప్రపంచాన్ని, అందులోని పాత్రల్ని ట్రైలర్లో పరిచయం చేశాం. కథ ఏమిటనేది సినిమా చూస్తేనే అర్థమవుతుంది. ట్రైలర్లో కథ మొత్తం చెప్పకూడదనే అలా డిజైన్ చేశాం.
కథానాయిక లావణ్య త్రిపాఠి పాత్ర ఎలా ఉంటుంది?
ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హ్యాపీ అనే అమ్మాయి పాత్రలో కనిపిస్తుంది. ఆమె బర్త్‌డే రాత్రి చోటుచేసుకున్న సంఘటనల చుట్టూ ఈ కథ నడుస్తుంది. అందుకే ‘హ్యాపీ బర్త్‌డే’ అనే టైటిల్ పెట్టాం.
ఇది గన్స్కు సంబంధించిన కథ కదా..ఎలాంటి గన్స్ వాడారు?
సెల్‌ఫోన్స్ ఎన్ని రంగుల్లో దొరుకుతాయే అలా కలర్ఫుల్గా గన్స్‌ను డిజైన్ చేశాం. దాదాపు అన్ని రకాల గన్స్‌ను ఉపయోగించాం. సినిమాలో థ్రిల్‌గా ఫీలయ్యే అంశమిది.
భవిష్యత్తులో కూడా ప్రయోగాత్మక చిత్రాలే చేస్తారా?
ప్రేక్షకులకు ఎప్పుడూ కొత్త కథల్ని చెప్పాలని ఆలోచిస్తుంటా. దర్శకుడిగా నేనేమిటో నిరూపించుకోవాలని ‘మత్తు వదలరా’ సినిమా చేశా. ‘హ్యాపీబర్త్‌డే’ కూడా ఓ విభిన్నమైన కథ. భవిష్యత్తులో డిఫరెంట్ జోనర్స్లో సినిమాలు చేయాలనుంది. నా తదుపరి సినిమా కూడా మైత్రీ మూవీమేకర్స్‌లో చేయబోతున్నా. ఇప్పటికే రెండు కథల్ని సిద్ధం చేశా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

