నందమూరి హీరో బాలకృష్ణ (Nandamuri Balakrishna), గోపీచంద్ మలినేని (Gopichandh Malineni) క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఎన్బీకే 107 (Nbk 107). మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ మూవీలో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఇప్పటికే రిలీజైన ఎన్బీకే 107 ఫస్ట్ హంట్ టీజర్..సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టడం ఖాయమని చెబుతోంది. గూస్ బంప్స్ తెప్పించే సంభాషణలతో అభిమానులకు కావాల్సిన వినోదాన్ని అందించేందుకు బాలకృష్ణ రెడీ అవుతున్నట్టు చెప్పేస్తుంది.
బాలకృష్ణ, గోపీచంద్ టీం ప్రస్తుతం టర్కీ షూటింగ్ షెడ్యూల్ తో బిజీగా ఉంది. ఈ సినిమా డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ రిషీ పంజాబీ (Rishi Punjabi) బాలకృష్ణతో కలిసి విక్టరీ సింబర్ చూపిస్తూ ఫొటో దిగారు. సోషల్ మీడియాలో షేర్ చేయగా..నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో కన్నడ స్టార్ యాక్టర్ ధునియా విజయ్ విలన్గా నటిస్తున్నాడు. కోలీవుడ్ భామ వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ డైరెక్టర్. అఖండ తర్వాత థమన్ మరోసారి అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నట్టు టీజర్ చెప్పేస్తుంది. రాయలసీమ బ్యాక్డ్రాప్లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు టాక్.
Lighter moments with the #legend #NandamuriBalakrishna sir #NBK pic.twitter.com/BxUpQOHyE0
— Rishi Punjabi (@RishiPunjabi5) August 28, 2022