వనవాసం ఎప్పుడు ముగుస్తుందో?
నటి రేణు దేశాయ్ తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అగ్ర నటుడు పవన్‌కల్యాణ్ నుంచి విడాకులు తీసుకొని 14ఏండ్లు గడిచినా తనను ఇప్పటికీ ఆయన మాజీ భార్యగానే గుర్తిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
నటి రేణు దేశాయ్ తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అగ్ర నటుడు పవన్‌కల్యాణ్ నుంచి విడాకులు తీసుకొని 14ఏండ్లు గడిచినా తనను ఇప్పటికీ ఆయన మాజీ భార్యగానే గుర్తిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ‘విశాల్ టాక్స్’ అనే పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ఆమె వ్యక్తిగత జీవితంలో తాను ఎదుర్కొంటున్న విమర్శలతో పాటు సాధించిన విజయాల గురించి అభిప్రాయాల్ని వెల్లడించారు. ‘2000 సంవత్సరంలో ‘బద్రి’ సినిమా కోసం హైదరాబాద్ వచ్చాను. కానీ అంతకుముందే నాకంటూ ఓ జీవితం ఉందనే విషయం ఎవరూ పట్టించుకోవడం లేదు.
విడాకులు తీసుకొని 14ఏండ్లు గడిచిపోయాయి. శ్రీరాముడు కూడా పద్నాలుగేళ్లే వనవాసం చేశాడు.. మరి నా వనవాసం ఎప్పుడు ముగుస్తుందో? అని రేణూ దేశాయ్ ప్రశ్నించారు. విడాకుల అనంతరం తాను వ్యక్తిగత జీవితంలో ఎన్నో విజయాలను సాధించానని రేణు దేశాయ్ గుర్తుచేసుకున్నారు. ఓ మరాఠి చిత్రాన్ని నిర్మించి మంచి విజయాన్ని అందుకున్నానని, మరో సినిమాకు రచన, నిర్మాణం, దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టానని ఆమె అన్నారు. డ్యాన్స్ రియాలిటీ షోలో పాల్గొనడంతో పాటు కవిత్వం రాశానని, తిరిగి సినిమాల్లో నటించానని రేణు దేశాయ్ తెలిపారు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు లేకపోతే ఇలాంటి అవకాశాలు ఎందుకొస్తాయని ఆమె ప్రశ్నించారు. ప్రస్తుతం ఆమె మాటలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

