Renu Desai | మరోసారి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి రేణూ దేశాయ్ స్ట్రాంగ్ వార్నింగ్.. వారి గురించి నేను భయపడను
Renu Desai | టాలీవుడ్లో బద్రి సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్, అనంతరం పవన్ కళ్యాణ్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్నారు.
Renu Desai | టాలీవుడ్లో బద్రి సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్, అనంతరం పవన్ కళ్యాణ్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్నారు. పవన్ మళ్లీ పెళ్లి చేసుకోగా రేణు మాత్రం రెండో వివాహం చేసుకోకుండా తన పిల్లలు అకీరా నందన్, ఆద్యల ఆలన పాలనా చూసుకుంటూ వారితో కలిసి జీవిస్తున్నారు. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఆమె తరచూ అభిమానుల ప్రశ్నలకు, కామెంట్లకు స్పందిస్తుంటారు. తాజాగా ఒక పవన్ కళ్యాణ్ అభిమాని చేసిన వ్యాఖ్యలు రేణు దేశాయ్‌ను తీవ్రంగా కలిచివేసింది.
మిమ్మల్ని మేము ఇంకా పవన్ కళ్యాణ్ భార్యగానే చూస్తాం. మీ జీవితంలో వేరొక మగాడిని ఊహించలేం అని సదరు అభిమాని రాసుకొచ్చాడు. దీనిపై రేణు ఘాటుగా స్పందిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. ఈ కామెంట్ చేసిన వ్యక్తి కొంత చదువుకున్నవాడేననుకుంటున్నా. సొంత ఇమెయిల్ ఐడీ క్రియేట్ చేసి, సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేసి ఇంగ్లీషులో కామెంట్ రాసే స్థాయిలో ఉన్నాడు. కానీ మనం 2025లో ఉన్నప్పటికీ, నేటికీ స్త్రీలు భర్త లేదా తండ్రి ఆస్తి అనే మనస్తత్వం సమాజంలో బలంగా ఉంది. ఇది పితృస్వామ్యం వల్లే” అని రేణు పేర్కొన్నారు.
ఇప్పటికీ మహిళలు చదువుకోవాలా, ఉద్యోగం చేయాలా అనే నిర్ణయాలకు ‘పర్మిషన్’ అవసరం అవుతోంది. ఇంకా స్త్రీ అంటే వంటగదిలో వంట చేయడం, పిల్లలు కనడం కోసం మాత్రమే అని భావించే మగవాళ్లు ఉన్నారు. ఈ ధోరణికి వ్యతిరేకంగా నేను గళం విప్పుతాను. నా స్నేహితులు, ఫాలోవర్స్ ఏమనుకుంటారో అని భయపడను. భవిష్యత్ తరాల మహిళల కోసం మార్పు తీసుకురావడమే నా ప్రయత్నం అని ఆమె రాసుకొచ్చారు. ఫెమినిజం అంటే వీకెండ్లో తాగి తిరగడం కాదు. మహిళలను పశువులుగా లేదా ఫర్నిచర్‌లా చూసే బేసిక్ మైండ్‌సెట్‌ను ప్రశ్నించడమే ఫెమినిజం. రాబోయే తరాల్లో అయినా స్త్రీలు ఈ విశ్వంలో తమ స్థానం సంపాదించాలని, గర్భంలోనే చంపబడకూడదని, పరువు హత్యలు, వరకట్న మరణాలు ఉండకూడదని కోరుకుంటున్నాను అని రేణు తన పోస్ట్‌లో తెలిపారు. ఈ పోస్ట్‌తో పాటు పవన్ కళ్యాణ్ అభిమానిని చేసిన కామెంట్ స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేశారు. దీంతో ఆమె స్పందన సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- aadya
- akira
- netigen
- Pawan Kalyan
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | 200 మంది అమ్మాయిలతో ‘తలైవా’ డ్యాన్స్.. థియేటర్లలో ఆ సీన్స్ మిస్!
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

