Sonu Sood | ఇండిగో విమాన సంక్షోభం.. సిబ్బందికి మద్దతుగా సోనూ సూద్
Sonu Sood | దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసులు రద్దు కావడం, ఆలస్యం కావడంతో విమానాశ్రయాలలో ప్రయాణికుల గందరగోళం ఇంకా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
Sonu Sood | దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసులు రద్దు కావడం, ఆలస్యం కావడంతో విమానాశ్రయాలలో ప్రయాణికుల గందరగోళం ఇంకా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సంక్షోభం కారణంగా వేల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు తమ ఆగ్రహాన్ని ఎయిర్‌లైన్ సిబ్బందిపై చూపవద్దంటూ ప్రముఖ నటుడు సోనూ సూద్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికపై ఒక వీడియోను పంచుకున్నాడు.
విమానాలు ఆలస్యం కావడం అనేది చాలా నిరాశను కలిగించే విషయం. కానీ ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్న ముఖాలను కూడా మీరు గుర్తుంచుకోండి. దయచేసి ఇండిగో సిబ్బంది పట్ల దయగా, వినయంగా ఉండండి. ఈ రద్దు ప్రభావం వారిపై కూడా ఉంది. వారికి మన మద్దతు అవసరం. నా కుటుంబం కూడా విమానాశ్రయంలో 4-5 గంటలు వేచి ఉండాల్సి వచ్చింది. కానీ, ఇటువంటి పరిస్థితుల్లో గ్రౌండ్ సిబ్బంది (Ground Staff) నిస్సహాయులు. వారికి ముందుగా షెడ్యూల్స్ గురించి తెలియదు. వారు కేవలం పై అధికారుల నుంచి వచ్చే సందేశాలను మాత్రమే ప్రయాణికులకు అందిస్తున్నారు అని సోనూ సూద్ పేర్కొన్నారు.
డీజీసీఏ (DGCA) అమలు చేసిన కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL) నిబంధనలే ఈ గందరగోళానికి ప్రధాన కారణం అయ్యాయని తెలుస్తుంది. పైలట్లకు తప్పనిసరి విశ్రాంతి సమయాన్ని పెంచడం వల్ల, ఇండిగో తమ భారీ నెట్‌వర్క్‌లో తక్షణమే సిబ్బంది కొరతను ఎదుర్కొంది. దీని ఫలితంగా గత నాలుగు రోజుల్లో దేశవ్యాప్తంగా 1,000కు పైగా విమాన సర్వీసులు రద్దు అయ్యాయి లేదా ఆలస్యమయ్యాయి.
“A delayed flight is frustrating, but remember the faces trying to fix it. Please be nice and humble to the IndiGo staff; they are carrying the weight of cancellations too. Let’s support them.” @IndiGo6E pic.twitter.com/rd3ciyekcS
— sonu sood (@SonuSood) December 6, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

