చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రికార్డ్ బ్రేక్’. చదలవాడ పద్మావతి నిర్మాత. నిహార్, నాగార్జున, రగ్థా ఇఫ్తాకర్ ముఖ్య పాత్రధారులు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని ఆదివారం ఘనంగా జరిపారు. సీనియర్ దర్శకుడు అజయ్‌కుమార్, సీనియర్ నిర్మాత రామసత్యనారాయణ, నిర్మాతల మండలి కార్యదర్శి టి.ప్రసన్నకుమార్ అతిథులుగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు. ‘అడవిరాముడు, వేటగాడు, దేవదాసు చిత్రాల ప్రేరణతో సినీరంగంలోకి అడుగుపెట్టాను.
సమాజానికి ఉపయోగపడే కథతో సినిమా తీయాలనేది నా కోరిక. ఆ కోరిక నుంచి పుట్టుకొచ్చిన కథే ‘రికార్డ్ బ్రేక్’. ఇందులో హీరో ఎవరూ ఉండరు. కథే హీరో. ఆర్ట్ డైరెక్టర్, ఫైట్ మాస్టర్, మ్యూజిక్ డైరెక్టర్ ఈ ముగ్గురు కూడా హీరోలే. చివరి 45 నిమిషాలు ఎమోషనల్‌గా ఉంటుంది. కచ్చితంగా అన్నిభాషల్లోనూ వండర్ క్రియేట్ చేస్తుంది’ అని నమ్మకం వెలిబుచ్చారు చదలవాడ శ్రీనివాసరావు. ఇంకా యూనిట్సభ్యులందరూ మాట్లాడారు.