సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా ‘హంట్’. శ్రీకాంత్, తమిళ నటుడు భరత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ పతాకంపై వి ఆనందప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు మహేష్ రూపొందించారు. ఈ నెల 26న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. బుధవారం ఈ చిత్ర ట్రైలర్ను స్టార్ హీరో ప్రభాస్ విడుదల చేశారు. ట్రైలర్ బాగుందన్న ప్రభాస్..చిత్రబృందానికి ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఈ సందర్భంగా నిర్మాత వి ఆనందప్రసాద్ మాట్లాడుతూ…‘కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. చిత్ర నిర్మాణంలో ఎక్కడా రాజీ పడలేదు. యాక్షన్ సీక్వెన్సులు ప్రత్యేక ఆకర్షణ అవుతాయి. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ మా చిత్రానికి పనిచేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ నెల 26న మా సినిమాను విడుదల చేస్తున్నాం’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : అరుల్ విన్సెంట్, సంగీతం : జిబ్రాన్.