Reba | ‘సామజవరగమన’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి రెబా మోనికా జాన్ ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. ఇటీవలే తాను గర్భవతిననే శుభవార్తను అభిమానులతో పంచుకున్న ఈ అందాల నటి, ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బేబీ బంప్‌తో భర్త జోమోన్ జోసెఫ్‌తో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోను షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. కొద్ది రోజుల క్రితం ఇద్దరం ముగ్గురిగా మారబోతున్నాం.. హల్లెలూయ అంటూ ప్రెగ్నెన్సీని ప్రకటించిన రెబా, అప్పటి నుంచి తన జీవితంలోని ప్రత్యేక క్షణాలను అభిమానులతో పంచుకుంటోంది. గర్భధారణ సమయంలోనే భర్తతో కలిసి థాయ్‌లాండ్ వెకేషన్‌కు వెళ్లిన ఆమె, అక్కడి ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులను అలరించింది.
తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో రెబా తన భర్తతో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ కనిపించింది. మా చిన్నారి రాకకు ముందు చివరి కొన్ని వారాలు ఇలా గడుస్తున్నాయి. ఈ సమయంలో చాలామంది ‘ఇంకా హాస్పిటల్ బ్యాగ్ సర్దుకోలేదా?’ అని అడుగుతున్నారు. కానీ మేమైతే ఇలా ఎంజాయ్ చేస్తున్నాం అంటూ ఆమె సరదాగా క్యాప్షన్ జత చేసింది. వీడియోలో రెబా ఎంతో ఉత్సాహంగా, ఎలాంటి ఆందోళన లేకుండా కనిపించగా, జోమోన్ కూడా ఆమెతో కలిసి స్టెప్పులు వేస్తూ సందడి చేశారు. ఈ వీడియో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. పలువురు సెలబ్రిటీలు కూడా కామెంట్ల ద్వారా తమ ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. ‘మంగళవారం’ నటి దివ్య పిళ్ళై స్పందిస్తూ, “ఆ బేబీ డ్యాన్స్ చేస్తూనే బయటకు వస్తుందేమో” అంటూ సరదా కామెంట్ చేయడం నెటిజన్లను నవ్విస్తోంది.
2016లో విడుదలైన ‘జాకబింటే స్వర్గరాజ్యం’ చిత్రంతో మలయాళ చిత్రసీమలో అడుగుపెట్టిన రెబా మోనికా జాన్, తన సహజ నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. తెలుగులో ‘బూ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ, ‘సామజవరగమన’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దళపతి విజయ్ నటించిన ‘విజిల్’ చిత్రంలో ఫుట్‌బాల్ క్రీడాకారిణిగా నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. అనంతరం ‘ఫోరెన్సిక్’, ‘ఎఫ్ఐఆర్’, ‘జన నాయకన్’, ‘కూలీ’ వంటి పలు చిత్రాల్లో నటించింది. తెలుగులో ‘మ్యాడ్ స్క్వేర్’లో స్పెషల్ సాంగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె, ఇటీవల ‘మృత్యుంజయ్’ చిత్రంలో కూడా కనిపించింది. 1994లో బెంగళూరులో జన్మించిన రెబా, అక్కడి క్రైస్ట్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం పూర్తి చేసింది. చిన్ననాటి నుంచే నృత్యంపై ఆసక్తి కలిగిన ఆమె, సంప్రదాయ నృత్యంలో శిక్షణ కూడా పొందింది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన రెబా, తర్వాత సినీ రంగంలో అడుగుపెట్టింది. తన చిరకాల స్నేహితుడు జోమోన్ జోసెఫ్‌ను 2022లో ప్రేమ వివాహం చేసుకున్న ఆమె, పెళ్లి తర్వాత కూడా నటిగా కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తోంది. ప్రస్తుతం తమ తొలి బిడ్డ రాక కోసం ఎదురుచూస్తున్న ఈ జంటకు అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.