Nani 30 | రెడీనా.. నాని 30పై న్యాచురల్ స్టార్.. ఇంతకీ అప్డేట్ ఏంటో..?
Nani 30 | న్యాచురల్ స్టార్ నాని (Nani) కాంపౌండ్ నుంచి వస్తున్న తాజా చిత్రం నాని 30 (Nani 30). డెబ్యూ డైరెక్టర్ శౌర్యువ్ (Shouryuv) డైరెక్ట్ చేస్తున్నాడు. చాలా రోజుల తర్వాత ట్వీట్ ద్వారా అప్డేట్ అందించాడు నాని.
Nani 30 | దసరాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాడు న్యాచురల్ స్టార్ నాని (Nani). ఈ హీరో కాంపౌండ్ నుంచి వస్తున్న తాజా చిత్రం నాని 30 (Nani 30). డెబ్యూ డైరెక్టర్ శౌర్యువ్ (Shouryuv) ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇంకా టైటిల్ ఫిక్స్ కాని ఈ చిత్రంలో సీతారామం ఫేం మృణాళ్ ఠాకూర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. చాలా రోజుల తర్వాత ట్వీట్ ద్వారా నాని 30 అప్డేట్ అందించాడు నాని.
రెడీనా..? అని నాని ట్వీట్ చేస్తూ.. సిల్వర్ స్క్రీన్‌పై వైరా ఎంటర్టైన్ మెంట్స్ డిస్ ప్లే అవుతున్న స్టిల్ స్క్రీన్ షాట్‌ను షేర్ చేశాడు. దీంతో నాని త్వరలోనే నాని 30 ఫస్ట్ లుక్ పోస్టర్ కానీ లేదా టీజర్ కానీ లాంఛ్ చేయబోతున్నాడంటూ చర్చించుకోవడం మొదలుపెట్టారు సినీ జనాలు.
నాని 30 అనౌన్స్మెంట్ సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ వీడియో ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రంలో నాని కూతురిగా బేబి కైరా ఖన్నా నటిస్తోంది. ఈ మూవీని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కేఎస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాని 30 చిత్రానికి సను జాన్ వర్గీస్ ఐఎస్సీ కెమెరామెన్. జెర్సీ, శ్యామ్ సింగరాయ్ సినిమాల తర్వాత కెమెరామెన్ సను జాన్ వర్గీస్ ఐఎస్సీ నానితో చేస్తున్న మూడో సినిమా కావడం విశేషం.
ఈ చిత్రానికి మలయాళం కంపోజర్, హృదయం ఫేం హెశమ్ అబ్దుల్ వహబ్ సంగీతం అందిస్తున్నాడు. నాని 30 చిత్రానికి ప్రవీణ్ ఆంటోనీ ఎడిటర్ కాగా.. జోతిష్ శంకర్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నాడు. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రాన్ని గోవా, ముంబైతోపాటు పలు లొకేషన్లలో షూట్ చేస్తున్నారు.
నాని 30పై న్యాచురల్ స్టార్ ట్వీట్..
Ready ? 😊 pic.twitter.com/2ZK3ao5E08
— Nani (@NameisNani) July 9, 2023
నాని 30 గ్లింప్స్ వీడియో..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

