RC15 | ఒక్క ఫైట్ ఎపిసోడ్ కోసమే అన్ని కోట్లా?
RC15 Fight episode | మెగా వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా తన నటన, అభినయంతో ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్‌చరణ్. ప్రస్తుతం ఈయన వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే ఈయన నటించిన ‘ఆర్ఆర్ఆర్’ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో చరణ్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. తండ్రికి తగ్గ తనయుడంటూ బాలీవుడ్ ప్రముఖులు చరణ్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటించాడు అనడం కంటే జీవించాడు అనడం సబబు. ప్రస్తుతం ఈయన సెన్సెషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ‘#RC15’ చేస్తున్నాడు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ స్థాయిలో అంచనాలున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టంట వైరల్‌గా మారింది.
శంకర్ సినిమాలంటేనే ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతాయిని తెలిసిన విషయమే. శంకర్ అనుకున్న విజువల్ కరెక్ట్ వచ్చేంత వరకు ఎంత రిస్క్ అయినా తీసుకుంటుంటాడు. కేవలం కొన్ని సీన్ల కోసమే నిర్మాతలతో కోట్లు ఖర్చుపెట్టిస్తుంటాడు. ప్రస్తుతం RC15లోనూ ఇదే జరుగుతుంది. ఒక యాక్షన్ ఎపిసోడ్ కోసమే మేకర్స్ దాదాపు రూ. 10కోట్లు ఖర్చుపెడుతున్నారట. ఈ ఫైట్ ఎపిసోడ్ 1000మందితో చిత్రీకరిస్తున్నారని టాక్. ప్రస్తుతం ఈ ఫైట్ సీన్ కోసం వర్క్ జరుగుతుందట. ఇటీవలే చరణ్ స్టైలిష్ లుక్ వీడియో విడుదలై వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో చరణ్‌కు జోడీగా కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అంతే కాకుండా ఈ చిత్రం దిల్‌రాజు నిర్మాణంలో 50వ సినిమాగా తెరకెక్కుతుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సునీల్, నవీన్ చంద్ర కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

