Dhamaka | ఫైర్ క్రాకర్‌లా ‘ధమాకా’ టీజర్.. రవితేజ ఎనర్జీ మాములుగా లేదుగా..!
Dhamaka Teaser | ప్రస్తుతం రవితేజ ఒక భారీ హిట్టు కోసం ఎదురు చూస్తున్నాడు. చాలా కాలం తర్వాత మాస్రాజ 'క్రాక్'తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు. అయితే అదే జోష్‌ను తన తదుపరి సినిమాల్లో కంటిన్యూ చేయలేకపోయాడు.
Dhamaka Teaser | ప్రస్తుతం రవితేజ ఒక భారీ హిట్టు కోసం ఎదురు చూస్తున్నాడు. చాలా కాలం తర్వాత మాస్రాజ ‘క్రాక్’తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు. అయితే అదే జోష్‌ను తన తదుపరి సినిమాల్లో కంటిన్యూ చేయలేకపోయాడు. ఈ ఏడాది రిలీజైన ‘ఖిలాడీ’, ‘రామారావు ఆన్ డ్యూటీ’లు వరుసగా ఫ్లాప్ అవడంతో తీవ్రంగా నిరాశపడ్డాడు. ప్రస్తుతం ఈయన ఆశలన్ని ‘ధమాకా’ పైనే ఉన్నాయి. త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కాగా తాజాగా చిత్రబృందం ధమాకా క్రాకర్ అంటూ టీజర్‌ను రిలీజ్ చేసింది.
టీజర్లో మాస్రాజ చెప్పే డైలాగ్స్, యాక్షన్ స్టంట్స్ ఫుల్ ఎనర్జీతో వేరే లెవల్లో ఉన్నాయి. చాలా కాలం తర్వాత ఇంత ఎనర్జిటిక్ పాత్రలో రవితేజ నటించినట్లు టీజర్ చూస్తే తెలుస్తుంది. ఈ చిత్రంలో రవితేజ రెండు విభిన్న గెటప్స్‌లో ఒకటి క్లాస్, మరొకటి మాస్ గెటప్‌లో కనిపిస్తున్నాడు. భీమ్స్ సిసిరోలియలో నేపథ్య సంగీతం గూస్బంప్స్ తెప్పిస్తుంది. ఇక ఈ చిత్రాన్ని డిసెంబర్ 23న రిలీజ్ చేయనున్నట్లు టీజర్లో ప్రకటించారు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవితేజకు జోడీగా ‘పెళ్ళి సందD’ ఫేం శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ-స్క్రీన్‌ప్లే-మాటలు అందిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

