రంగంలోకి రవితేజ

రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దివ్యాంశకౌశిక్ కథానాయికగా నటిస్తోంది. జూలై 1 నుంచి హైదరాబాద్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. నిర్మాత మాట్లాడుతూ ‘వాస్తవ ఘటనల ఆధారంగా రూపుదిద్దుకోనున్న థ్రిల్లర్ చిత్రమిది. మునుపెన్నడూ చూడనటువంటి కొత్త పాత్రలో రవితేజ కనిపిస్తారు. జూలై 1 నుంచి హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో తొలి షెడ్యూల్‌ను మొదలుపెట్టబోతున్నాం. ఈ షెడ్యూల్లో ప్రధాన తారాగణం అందరూ పాల్గొంటారు’ అని తెలిపారు. 1990 బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో రవితేజ ప్రభుత్వ అధికారిగా కనిపించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రానికి సంగీతం: సామ్ సీఎస్, సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

