హత్య కేసు శోధనలో..
రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘రావణాసుర’. సుధీర్‌వర్మ దర్శకుడు. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీటీమ్ వర్క్స్ పతాకాలపై అభిషేక్ నామా, రవితేజ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సోమవారం టీజర్‌ను విడుదల చేశారు.
రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘రావణాసుర’. సుధీర్‌వర్మ దర్శకుడు. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీటీమ్ వర్క్స్ పతాకాలపై అభిషేక్ నామా, రవితేజ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సోమవారం టీజర్‌ను విడుదల చేశారు. ఓ హత్యకేసు పరిశోధనతో మొదలైన టీజర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. రవితేజను లాయర్ పాత్రలో పరిచయం చేశారు. యాక్షన్ ఘట్టాలు రొమాంచితంగా సాగాయి. ‘సీతను తీసుకెళ్లాలంటే సముద్రం దాటితే సరిపోదు..ఈ రావణాసురుణ్ణి దాటి వెళ్లాలి’ అంటూ రవితేజ చెప్పే సంభాషణ మరింత ఆసక్తిని పెంచింది. ‘క్రైమ్ థ్రిల్లర్ ఇది. ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేతో సాగుతుంది. దర్శకుడు సుధీర్‌వర్మ తనదైన ైస్టెలిష్ మేకింగ్‌తో తెరకెక్కించాడు’ అని చిత్రబృందం పేర్కొంది. సుశాంత్, శ్రీరామ్, అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ, రావు రమేష్, మురళీశర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: విజయ్ కార్తీక్ కన్నన్, సంగీతం: హర్షవర్దన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో, కథ, సంభాషణలు: శ్రీకాంత్ విస్సా, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుధీర్‌వర్మ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

