Ravi Teja | స్పెయిన్‌లో రవితేజ టీం ల్యాండింగ్..లేటెస్ట్ అప్డేట్ ఇదే
రామారావు ఆన్ డ్యూటీ (Ramarao On Duty)మూవీకి సంబంధించిన తాజా అప్ డేట్ ఒకటి ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. డెబ్యూట్ డైరెక్టర్ శరత్ మండవ (Sarat Mandava), రామారావు అండ్ టీం స్పెయిన్‌లో ల్యాండ్ అయింది.
టాలీవుడ్ యాక్టర్ రవితేజ ( Ravi Teja) నటిస్తోన్న కొత్త ప్రాజెక్టుల్లో ఒకటి రామారావు ఆన్ డ్యూటీ (Ramarao On Duty). డెబ్యూట్ డైరెక్టర్ శరత్ మండవ (Sarat Mandava) డైరెక్ట్ చేస్తున్నాడు. దివ్యాంక కౌశిక్ (Divyansha Kaushik), రజిష విజయన్ (Rajisha Vijayan) హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీకి సంబంధించిన తాజా అప్ డేట్ ఒకటి ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్ డేట్ తెరపైకి వచ్చింది. రామారావు అండ్ టీం స్పెయిన్‌లో ల్యాండ్ అయింది.
స్పెయిన్‌లోని అందమైన లొకేషన్లలో కొన్ని పాటలను చిత్రీకరించనున్నట్టు టాక్. సాంగ్స్ షూట్‌తో రామారావు చిత్రీకరణ మొత్తం పూర్తవుతుందట. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా షురూ కానున్నాయట. ఈ చిత్రంలో సీనియర్ నటులు నాజర్, తనికెళ్లభరణి, పవిత్ర లోకేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీత దర్శకుడు.
ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. సీనియర్ నటుడు వేణు తొట్టెంపూడి చాలా కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై కనిపించబోతున్నాడు. రామారావు ఆన్ డ్యూటీ డిజిటల్ రైట్స్ ను సోనీలివ్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. రవితేజ దీంతోపాటు సుధీర్ వర్మ డైరెక్షన్లో రావణాసుర, త్రినాథ రావు నక్కినతో ధమాకా సినిమాలు చేస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

