Ravi Teja Action mode | యాక్షన్ మూడ్‌లో రవితేజ..క్రేజీ అప్డేట్ వివరాలివే
డిఫరెంట్ జోనర్ సినిమాలతో డిఫరెంట్ రోల్స్ లో నటిస్తూ అభిమానులు, మూవీ లవర్స్ ను ఫుల్ ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాడు రవితేజ (Ravi Teja). ఈ హీరో కొత్త సినిమాల్లో ఒకటి ధమాకా (Dhamaka).
టాలీవుడ్ హీరో రవితేజ (Ravi Teja)ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. డిఫరెంట్ జోనర్ సినిమాలతో డిఫరెంట్ రోల్స్ లో నటిస్తూ అభిమానులు, మూవీ లవర్స్ ను ఫుల్ ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. రవితేజ కొత్త సినిమాల్లో ఒకటి ధమాకా (Dhamaka). త్రినాథరావు నక్కిన (Trinadha Rao Nakkina) డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన కొత్త షెడ్యూల్ ఇవాళ హైదరాబాద్‌లో మొదలైంది. ప్రస్తుతం హెవీ డ్యూటీ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ సీక్వెన్స్ కోసం భారీ సెట్టు వేయగా..ఫైట్ మాస్టర్ రామ్-లక్ష్మణ్ ( Ram Lakshman ) పర్యవేక్షణలో రవితేజ అండ్ ఫైటర్స్ పై యాక్షన్ పార్టు షూట్ చేస్తున్నారు.
పెళ్లిసందD సినిమాలతో అందాలు ఆరబోసిన శ్రీలీల ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రంలో రవితేజ న్యూ లుక్‌తో కనిపించనున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. రవితేజ ఇటీవలే రమేశ్ వర్మ డైరెక్షన్లో నటించిన ఖిలాడి బాక్సాపీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.

మాస్ మహారాజా మరోవైపు కొత్త డైరెక్టర్ శరత్ మండవ డైరెక్షన్లో రామారావు ఆన్ డ్యూటీ సినిమా చేస్తున్నాడు. దీంతోపాటు సుధీర్ వర్మ డైరెక్షన్ లో రావణాసుర చిత్రంలో నటిస్తున్నాడు. ఈ ప్రాజెక్టులో సుశాంత్, అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాశ్, పూజిత పొన్నాడ, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్ కీ రోల్స్ చేస్తున్నారు. టైగర్ నాగేశ్వర్రావు సినిమాను కూడా లైన్లో పెట్టాడు రవితేజ.
Aadavallu Meeku Joharlu | శర్వానంద్ ఈవెంట్‌కు చీఫ్ గెస్టులుగా స్టార్ హీరోయిన్లు
RGV Bheemla Nayak tweet | పవన్ కల్యాణ్ ఓ సునామి..భీమ్లా నాయక్‌పై ఆర్జీవీ ట్వీట్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

