Dhamaka | నెట్‌ఫ్లిక్స్ లో కూడా ధమాకా హవా.. టాప్ 10లో ట్రెండింగ్
గతేడాది డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది రవితేజ (Ravi Teja). త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ధమాకా (Dhamaka) సినిమాతో రూ.100 కోట్ల క్లబ్‌ను దాటేసి తన పవర్ ఏంటో బాక్సాఫీస్‌కు రుచి చూపించాడు.
క్రాక్ సినిమాతో ట్రాక్‌పైకి ఎక్కి బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించాడు రవితేజ (Ravi Teja). త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ధమాకా (Dhamaka) గతేడాది డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో మరోసారి మంచి కిక్ ఇచ్చే విజయాన్ని అందుకున్నాడు. ఈ మాస్ మహారాజా ధమాకా సినిమాతో రూ.100 కోట్ల క్లబ్‌ను దాటేసి తన పవర్ ఏంటో బాక్సాఫీస్‌కు రుచి చూపించాడు.
అందం, అభినయంతో డ్యాన్స్ తో ఇరగదీస్తూ.. ధమాకా సక్సెస్‌లో కీ రోల్ పోషించింది శ్రీలీల. ఈ మూవీ 5 రోజుల క్రితం పాపులర్ ఓటీటీ ఫ్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ లోకి ఎంటరైంది. డిజిటల్ ఫ్లాట్‌ఫాంలో కూడా వ్యూవర్ షిప్ విషయంలో సూపర్ క్రేజ్ లిస్టులో చేరిపోయింది. Netflixలో ఈ వారం ఇండియాలో టాప్ 10 పొజిషన్లో రెండో స్థానంతో ట్రెండింగ్‌లో నిలిచింది.
ధమాకాలో విలన్‌గా నటించిన చిరాగ్ జాని ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కిన ఈ చిత్రంలో జయరాయ్, సచిన్ ఖేడ్కర్, రావు రమేశ్, తనికెళ్లభరణి, హైపర్ ఆది కీలక పాత్రల్లో నటించారు. భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన ఆల్బమ్‌ను మ్యూజిక్ లవర్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.
రవితేజ ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ వీడియో సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. మరోవైపు పాన్ ఇండియా ప్రాజెక్ట్ టైగర్ నాగేశ్వర్రావు లో కూడా నటిస్తున్నాడు. ఈ మూవీలో బాలీవుడ్ భామ కృతిసనన్ సోదరి నుపుర్ సనన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. నుపుర్సనన్కు టాలీవుడ్ ఎంట్రీ మూవీ ఇదే కావడం విశేషం.
Unstoppable #Dhamaka after theatres now BlockBuster Rampage in @Netflix_INSouth 💥🔥🔥#Dhamaka Trending #2️⃣ on NetFlix🥳🤩@RaviTeja_offl @sreeleela14 @TrinadharaoNak1 @vishwaprasadtg @vivekkuchibotla @KumarBezwada @peoplemediafcy @sujithkolli @director_kv @JaniChiragjani pic.twitter.com/G6ov4wQ4kk
— Chirag jani (@JaniChiragjani) January 27, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

