Ravi Teja | థియేటర్లలో మీరే చూస్తారు కదా.. అభిమానులకు రవితేజ హామీ
త్రినాథరావు నక్కిన డైరెక్ట్ చేస్తున్న ధమాకా (Dhamaka) సినిమా నుంచి భీమ్స్ సిసీరోలియా కంపోజ్ చేసిన పాటలను మ్యూజిక్ లవర్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. కాగా ఈ మాస్ యాక్షన్ సినిమా డిసెంబర్ 23న విడుదల కానుంది.
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ ధమాకా (Dhamaka). త్రినాథరావు నక్కిన డైరెక్ట్ చేస్తున్నాడు. పెళ్లి సందD ఫేం శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి భీమ్స్ సిసీరోలియా కంపోజ్ చేసిన పాటలను మ్యూజిక్ లవర్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. కాగా ఈ మాస్ యాక్షన్ సినిమా డిసెంబర్ 23న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రవితేజ తన అభిమానుల్లో జోష్ నింపుతూ చేసిన ట్వీట్ ఇపుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ధమాకా నుంచి ఫుల్ ఎంటర్టైన్మెంట్ను ఆశించవచ్చా.. అని ఓ నెటిజన్ అడగగా.. థియేటర్లలో మీరే చూస్తారు కదా.. అని రీట్వీట్ చేశాడు రవితేజ. మూవీ లవర్స్ ఈ చిత్రాన్ని థియేటర్లలో ఫుల్‌గా ఎంజాయ్ చేయడం పక్కా అని రవితేజ రిప్లైతో తెలిసిపోతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో చిరాగ్ జానీ విలన్‌గా నటిస్తున్నాడు.
రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర చేస్తుండగా.. దీంతోపాటు పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వర్‌రావులో కూడా నటిస్తున్నాడు. ఇందులో నుపుర్ సనన్ హీరోయిన్గా నటిస్తోంది. మరోవైపు వాల్తేరు వీరయ్యలో కీ రోల్ చేస్తున్నాడు.
Theatres lo meere choostharu kadha 😉#AskRaviteja #Dhamaka #DhamakaFromDec23 https://t.co/QxHGHKYxIa
— Ravi Teja (@RaviTeja_offl) December 9, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

