Ravi Teja | జాతిరత్నాలు డైరెక్టర్-రవితేజ సినిమా లాంఛ్ ఎప్పుడంటే..?
Ravi Teja | టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) ఇటీవలే ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడని తెలిసిందే. ఓటీటీ ప్లాట్‌ఫాం ETV Win, Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మిస్టర్ బచ్చన్ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు రవితేజ.
Ravi Teja | టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) ఇటీవలే ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడని తెలిసిందే. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫాం ETV Win, Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మిస్టర్ బచ్చన్ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు.
హిందీలో హిట్‌గా నిలిచిన రైడ్‌కు అఫీషియల్ రీమేక్‌గా వస్తోంది. ఇందులో ప్రభుత్వ అధికారి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇదిలా ఉంటే మరోవైపు జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ కేవీ (Anudeep KV) డైరెక్షన్లో ఓ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. క్రేజీ కామెడీ జోనర్లో రాబోతున్న ఈ సినిమా వచ్చే నెలలో పూజా కార్యక్రమాలతో షురూ కానుంది. రవితేజ మిస్టర్ బచ్చన్ పూర్తి చేసిన వెంటనే సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారట. ఇంకేంటి మరి త్వరలోనే కడుపుబ్బా నవ్వించే కామెడీ సినిమా చూసేందుకు రెడీ అవ్వండి మరి.
రవితేజ అంటే సూపర్ మాస్ ఎనర్జీతో సాగే కామెడీ ట్రాక్ ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక తొలి సినిమా జాతిరత్నాలుతో నవ్వుల పువ్వులు పూయించాడు అనుదీప్ కేవీ. ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

