e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, January 26, 2022
Home News RAVI: ర‌వి అంత పారితోషికం అందుకున్నాడా..!

RAVI: ర‌వి అంత పారితోషికం అందుకున్నాడా..!

ఊహించ‌ని ట్విస్ట్‌తో బిగ్ బాస్ హౌజ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన యాంక‌ర్ ర‌వి పారితోషికం ప్ర‌స్తుతం చర్చ‌నీయాంశంగా మారింది. బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లలో రవికి అత్యధిక పారితోషికం చెల్లిస్తున్నారట! వారానికి రూ. 7 లక్షల నుంచి 8 లక్షల మధ్యలో ఇస్తున్నారట. మ‌రో రెండు వారాలు ఉంటే చాలా మొత్తం చెల్లించాల్సి ఉంటుంద‌ని భావించిన బిగ్ బాస్ యాజ‌మాన్యం ఊహించ‌ని ఎలిమినేష‌న్‌తో బ‌య‌ట‌కు పంపించిన‌ట్టు టాక్స్ న‌డుస్తున్నాయి.

ర‌వి బిగ్ బాస్ హౌజ్‌లో 12 వారాలు ఉన్నాడు కాబ‌ట్టి అత‌ను 90 లక్షల రూపాయలు వెనకేసినట్లు తెలుస్తోంది. ఇది బిగ్‌బాస్‌ విజేతకు అందించే 50 లక్షల ప్రైజ్‌మనీ కన్నా ఎక్కువ కావడం గమనార్హం! షో ముగింపు ద‌శ‌కు చేరుకున్న నేప‌థ్యంలో ర‌విని ఇంకా హౌజ్‌లో ఉంచి మ‌రింత రెమ్యున‌రేష‌న్ ఇచ్చే సాహ‌సం నిర్వాహ‌కులు చేయ‌లేద‌ట‌. అందుకే అత‌నిని బ‌య‌ట‌కు పంపించార‌ని ప్ర‌చారం నడుస్తుంది. ఒక లేడీ కంటెస్టెంట్‌ను ఫినాలేకు పంపించాలని కూడా బలంగా ఫిక్సయినట్లు రవి ఎలిమినేషన్‌తో చెప్పకనే చెప్పారు.

- Advertisement -

ర‌వి ఎలిమినేష‌న్‌తో నిర్వాహ‌కుల‌పై తిట్టి పోస్తున్నారు. ఏ స‌ర్వేలో కూడా ర‌వి ఎలిమినేట్ అయిన‌ట్టు లేదు. కావాల‌నే ఎలిమినేట్ చేశారు అని అంటున్నారు. కాజల్‌, సిరి, ప్రియాంక కంటే రవికే తక్కువ ఓట్లు వచ్చాయంటే నమ్మలేకపోతున్నామని విచారం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement