Bhojpuri Cinema | బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన భారీ బ్లాక్‌బస్టర్ ఫ్రాంచైజ్ ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద రూ. 3,100 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా తెచ్చిన క్రేజ్ వల్ల, నటుడు రవి కిషన్ ప్రధాన పాత్రలో 2013లో విడుదలైన ‘ధురంధర్: ది షూటర్’ అనే పాత భోజ్‌పురి యాక్షన్ చిత్రం అకస్మాత్తుగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఈ పాత సినిమా క్లిప్‌లను నెట్టింట విపరీతంగా షేర్ చేస్తుండటంతో ఈ చిత్రానికి ఊహించని డిజిటల్ ఆదరణ లభిస్తోంది.
ఈ ఆకస్మిక విజయంపై రవి కిషన్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు. తన కెరీర్లో ఇలాంటి ఊహించని మలుపులు రావడం అలవాటేనని, అప్పట్లో ఈ సినిమాను భిన్నమైన జోనర్లో వైవిధ్యంగా తీశామని గుర్తు చేసుకున్నారు. దశాబ్దం తర్వాత ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపిన ఆయన.. ప్రస్తుత వ్యూస్ చూస్తుంటే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ఉన్న నిర్మాత రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయి ఉంటాడంటూ సరదాగా వ్యాఖ్యానించారు.