బుల్లితెరపై మాస్ మహారాజాగా ఎదిగిన రవి బిగ్ బాస్ సీజన్ 5లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టాడు. షోలో అడుగుపెట్టినప్పటి నుండే అతనిపై భారీ అంచనాలు ఉన్నాయి. కప్ గెలవలేకపోయిన కూడా టాప్ 5లో తప్పక ఉంటాడని అందరు అనుకున్నారు. కాని ఊహించని విధంగా గతవారం హౌజ్ నుండి బయటకు వచ్చాడు. దీంతో రవి ఫ్యాన్స్ చాలా నిరుత్సాహానికి గురయ్యారు. అయితే హౌజ్ నుండి బయటకు వచ్చాక రవి తొలిసారి తన ఇన్‌స్టా లైవ్‌లోకి వచ్చాడు.
ఇందులో బిగ్ బాస్ షో గురించి… మీమ్స్ రాయుళ్ల గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. నేను వెళ్లేముందే చెప్పాను.. నన్ను ఆడుకోండి, వాడుకోండి, ట్రోల్ చేయండి, మీ ఇష్టమని చెప్పాను. కానీ చాలామంది నా ఫ్యామిలీని, నిత్యను ఇన్వాల్వ్ చేశారు. ఆఖరికి నా బిడ్డను కూడా వదల్లేదు. అంటే బయటొక బ్యాచ్ ఉంటుంది.. వాళ్లకు డబ్బులిస్తే వాళ్ల ఫ్యామిలీ గురించి కూడా చెత్తగా మాట్లాడతారు.
వారిని ఏం అనాలో కూడా తెలియడం లేదు. మరీ ఇంత దారుణమా..! బిగ్ బాస్ ఇంట్లో జరిగేది ఒకటైతే.. బయటకు మరొకటి చూపిస్తున్నారని రవి అన్నాడు. తాను చేసింది ఒకటి.. బయటకు వేరేలా ప్రొజెక్ట్ చేశారంటూ రవి తెలిపాడు. 24 గంటల్లో ఒకే గంట మాత్రమే చూపిస్తున్నారు. బిగ్‌బాస్ అనేది మైండ్ గేమ్.. వాళ్లూవీళ్లూ చెప్పేది కాకుండా మీకు ఎవరు బాగా ఆడుతున్నారనిపిస్తే వారికే ఓటేయండి అని చెప్పుకొచ్చాడు రవి. కాగా, లహరి-ప్రియ ఎపిసోడ్లో అమ్మ మీద ఒట్టు అంటూ అబద్దాలు చెప్పడం రవికి అతిపెద్ద మైనస్ అని చెప్పొచ్చు. శ్వేత ఎలిమినేషన్‌కి కూడా పరోక్షంగా రవి కారణం అవ్వడంతో మరింత నెగిటివ్ అయ్యాడు.