Razor Trailer | టాలీవుడ్ విలక్షణ నటుడు, దర్శకుడు రవిబాబు స్వీయ దర్శకత్వంలో ప్రధాన పాత్ర పోషిస్తూ రూపొందించిన చిత్రం ‘రేజర్’ (Razor). ఈ సినిమా మే 8న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. క్రైమ్ మరియు యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ను చూస్తుంటే.. ఈ చిత్ర కథాంశం ఒక చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు ఓ వ్యక్తి శక్తివంతమైన రాజకీయ మరియు నేర వ్యవస్థతో చేసే పోరాటం చుట్టూ తిరుగుతుంది. తాజాగా విడుదలైన ట్రైలర్లో రవిబాబు అత్యంత భయంకరంగా, రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపిస్తూ సినిమాపై అంచనాలను పెంచేశారు. ‘Justice will be brutal’ అనే ట్యాగ్‌లైన్‌కు తగ్గట్టుగా ట్రైలర్‌లోని యాక్షన్ సన్నివేశాలు చాలా ఉద్వేగభరితంగా మరియు హింసాత్మకంగా ఉండబోతున్నాయని స్పష్టమవుతోంది. గతంలో ‘అవును’, ‘నచ్చావులే’ వంటి వైవిధ్యమైన చిత్రాలను అందించిన రవిబాబు, ఈసారి కూడా ఒక సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు. మరోవైపు ఈ చిత్రం విడుదల తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. మే 8వ తేదీ రవిబాబు తండ్రి, దివంగత ప్రముఖ నటుడు చలపతిరావు గారి జయంతి కావడంతో, ఆయన జ్ఞాపకార్థం అదే రోజున సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించారు.
ఈ చిత్రాన్ని సురేష్ బాబు సమర్పణలో ఫ్లయింగ్ ఫ్రాగ్స్ మరియు సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. రవిబాబు దర్శకత్వం వహించడమే కాకుండా కథను కూడా ఆయనే అందించారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్. రాజేష్ సంగీతం అందించగా, చరణ్ మాధవనేని ఛాయాగ్రాహకుడిగా, సతీష్ పొలోజు యాక్షన్ కొరియోగ్రఫర్‌గా వ్యవహరించారు. వేసవి కానుకగా విడుదలవుతున్న ఈ ‘రేజర్’ బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి.
#RazorTheMovie Trailer out now 💥 pic.twitter.com/gSCsVBwSqS#RazorOnMay8th#Razor Coming to scorch theatres this summer on May 8th.#RaviBabu @sureshprodns @IAmTanishAlladi
@mirchihemanth @pragath_jadhav@SiddaVenkatesh3 @inaya_sultana @InayaSultanaFan @saicharanmadha2…— Balaji (@RDBalaji) April 18, 2026