Ravi Babu | పెద్ది వాయిదా ప్రభావం.. చిన్న సినిమాలు ఇబ్బందుల్లో,రవిబాబు సంచలన వ్యాఖ్యలు
Ravi Babu | టాలీవుడ్లో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న పెద్ది సినిమా విడుదల వాయిదా పడటం ఇండస్ట్రీపై ప్రభావం చూపుతోంది. మొదట ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన ఈ చిత్రం అనేక మార్లు తేదీలు మారుతూ చివరకు జూన్ 4కు ఖరారైంది. ఈ మార్పుల కారణంగా చిన్న సినిమాల విడుదల గందరగోళానికి గురయ్యాయి.
Ravi Babu | టాలీవుడ్లో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న పెద్ది సినిమా విడుదల వాయిదా పడటం ఇండస్ట్రీపై ప్రభావం చూపుతోంది. మొదట ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన ఈ చిత్రం అనేక మార్లు తేదీలు మారుతూ చివరకు జూన్ 4కు ఖరారైంది. ఈ మార్పుల కారణంగా చిన్న సినిమాల విడుదల గందరగోళానికి గురయ్యాయి. పెద్ది సినిమాకి ఇప్పటికే పలు డేట్స్ చెప్పారు. అయితే చెప్పిన తేదీన వస్తుందని భావించి, చాలా చిన్న సినిమాలు తమ విడుదలలను వాయిదా వేసుకున్నాయి. అయితే చివరి నిమిషంలో పెద్ది రాకపోవడంతో కొందరు నిర్మాతలు అయోమయంలో పడ్డారు. ఈ ప్రభావం దర్శకుడు రవిబాబు తెరకెక్కించిన ‘రేజర్’ సినిమాపై కూడా పడింది. ఈ చిత్రం మే 8న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రవిబాబు విడుదల తేదీల గందరగోళంపై స్పందించారు.
మొదట మా సినిమాను మే 1న విడుదల చేయాలని అనుకున్నాం. కానీ ఒక పెద్ద సినిమా వస్తుందని ప్రచారం జరిగింది. ఆ భయంతో మార్కెట్ మొత్తం హడావుడిగా మారింది. పెద్ద సినిమాలు ఒక తేదీ ప్రకటిస్తాయి కానీ ఆ రోజున రావు. వాటి వల్ల చిన్న సినిమాలు ఇబ్బందులు పడుతున్నాయి” అని ఆయన అన్నారు. ఆ సినిమా వస్తుందని భావించి మేము వాయిదా వేసుకున్నాం. మళ్లీ వస్తుందని, మళ్లీ రాదని ఇలా కొన్ని రోజుల పాటు గందరగోళం కొనసాగింది. చివరకు ఈ పరిస్థితి సరిగ్గా లేదని భావించి మాకు మే 8 తేదీని ఖరారు చేసుకున్నాం. ఆ రోజు నా తండ్రి పుట్టినరోజు కావడం కూడా ప్రత్యేకం అని రవిబాబు తెలిపారు.
ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. పెద్ద సినిమాల విడుదల తేదీల మార్పులు చిన్న చిత్రాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయనే అంశం మరోసారి వెలుగులోకి వచ్చింది. నిర్మాతలు, దర్శకులు ఈ సమస్యకు పరిష్కారం కావాలని కోరుతున్నారు.దీనిపై పెద్ద నిర్మాతలు ఎవరైన స్పందిస్తారా అనేది చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- buchi babu
- glimpse
- peddi
- ram charan
RELATED ARTICLES
తాజా వార్తలు
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

