Ravanasura Movie | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన రావణాసుర.. స్ట్రీమింగ్ ప్లాట్ఫార్మ్ ఏదంటే?
Ravanasura Movie On OTT | రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్లతో రవితేజ తిరిగి ఫామ్‌లోకి వచ్చేశాడనుకుంటే 'రావణాసుర' రూపంలో మరో ఫ్లాప్ చేరింది. రిలీజ్‌కు ముందు చేసిన హడావిడితో సినిమాపై ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి.
Ravanasura Movie On OTT | రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్లతో రవితేజ తిరిగి ఫామ్‌లోకి వచ్చేశాడనుకుంటే ‘రావణాసుర’ రూపంలో మరో ఫ్లాప్ చేరింది. రిలీజ్‌కు ముందు చేసిన హడావిడితో సినిమాపై ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి. పైగా రవన్న నెగెటీవ్ షెడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నాడనడంతో అంచనాలు తారా స్థాయికి చేరాయి. తీరా రిలీజయ్యాక తొలిరోజే ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది. కథ కొత్తగా ఉన్న కథనం ఆసక్తిగా లేదని పలువురు సినీ అభిమానులు అభిప్రాయపడ్డారు. అయితే ఫలితం ఎలా ఉన్నా రవితేజ నటన మాత్రం ఈ సినిమాలో వేరే లెవల్లో ఉంది. నెగెటీవ్ క్యారెక్టర్లో జీవించేశాడు. డైరెక్టర్ సుధీర్ వర్మ బోటా బోటి మార్కులతోనే సరిపెట్టుకున్నాడు.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని డిజిటల్ ప్రియులు ఎంత గానో ఎదురు చూస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. గత అర్థరాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ముందస్తు అనౌన్స్మెంట్ లేకుండానే ఈ సినిమా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ జోడీగా అను ఇమాన్యూయేల్, మేఘా ఆకాశ్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగర్కర్, పూజిత పొన్నాడలు నటించారు. అక్కినేని సుశాంత్ కీలకపాత్ర పోషించాడు. ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌తో కలిసి రవితేజ ఆర్టీ టీం వర్క్స్ బ్యానర్‌పై స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

