రీసెంట్గా ధమాకా సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు రవితేజ (Ravi Teja). మాస్ మహారాజా నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి రావణాసుర (Ravanasura). యూనిక్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సుధీర్ వర్మ (Sudheer Varma) డైరెక్ట్ చేస్తున్నాడు. మరో రెండు రోజుల్లో రవితేజ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ గిఫ్ట్ అందించేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు.
జనవరి 26న రావణాసుర గ్లింప్స్ వీడియోను లాంఛ్ చేయనున్నట్టు ఓ వీడియో ద్వారా తెలియజేశారు. రావణాసురలో అనూ ఎమ్మాన్యుయేల్, పూజిత పొన్నాడ, దక్షా నగార్కర్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాశ్ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో యువ నటుడు సుశాంత్ విలన్గా నటిస్తున్నాడు. అభిషేక్ పిక్చర్స్, రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్లపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో రావు రమేశ్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రాన్ని 2023 ఏప్రిల్ 7న థియేటర్లలో గ్రాండ్గా విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. రావణాసుర చిత్రానికి హర్షవర్దన్ రామేశ్వర్- భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. రవితేజ మరోవైపు పాన్ ఇండియా ప్రాజెక్టు టైగర్ నాగేశ్వర్ రావులో కూడా నటిస్తున్నాడు. ఇటీవలే షూటింగ్కు సంబంధించిన అప్డేట్ కూడా బయటకు వచ్చింది.
రావణాసుర గ్లింప్స్ వీడియో అప్డేట్..
Get ready for a special treat on MASS MAHARAJA @RaviTeja_offl birthday😎
A Glimpse of #Ravanasura On JAN 26th 2023 🔥
Stay Tuned ❤️🔥@iamSushanthA @sudheerkvarma @RTTeamWorks @SrikanthVissa @rameemusic #BheemsCeciroleo @RavanasuraMovie @AbhishekPicture pic.twitter.com/fWD6gBhOHX
— RT Team Works (@RTTeamWorks) January 24, 2023