తనదైన నటనతో ఎందరో మనసులలో చెరగని ముద్ర వేసుకున్న అందాల నటి సౌందర్య. ఆమె జీవితం తెరచిన పుస్తకం. చిన్నతనంలోనే పై లోకాలకు వెళ్లిన సౌందర్య ఎందరికో తీరని శోకాన్ని మిగిల్చింది. ఆమె బయోపిక్ గురించి ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి. కాని అఫీషియల్‌గా ఏ ప్రకటన రావడం లేదు.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో కన్నడ సోయగం రష్మికను మీరు బయోపిక్‌లో చేయాల్సి వస్తే ఎవరి పాత్రలో నటిస్తారు అని ప్రశ్నించగా, ఆమె దివంగత నటి సౌందర్య పేరు చెప్పింది. సౌందర్యనే ఎంచుకోవడానికి కారణం ఉందని రష్మిక తెలిపింది. నేను సినిమాల్లోకి రాకముందు మా నాన్న ఒక మాట అనేవారు.. నేను సౌందర్య గారిలా ఉంటానట. తరచుగా నాతో ఆ మాట అనేవారు. ఇక సౌందర్య నటన, సినిమాలు అంటే కూడా నాకు ఇష్టం.
ఈ క్రమంలోనే నేను సౌందర్య బయోపిక్‌లో నటించాలని ఉంది అని తెలిపింది. ప్రస్తుతం రష్మిక పుష్ప సినిమాతో పాటు పలు తెలుగు, తమిళం, హిందీ భాషలకు సంబంధించిన సినిమాలలో నటిస్తుంది.