ఆ విషయంలో గర్వపడుతున్నా!
తన సినీ ప్రయాణంలో నటన మొదలుకొని భాష, సంభాషణలు పలికే విధానం, యాస.. ఇలా ఎన్నో విషయాల్లో విమర్శలను ఎదుర్కొన్నానని, అయితే వాటి కారణంగా తాను ఏనాడు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదని రష్మిక మందన్న స్పష్టం చేసింది. విజయ్ దేవరకొండతో కలిసి ఇటీవల ‘కాఫీ విత్ కరణ్' సీజన్ 9లో పాల్గొన్న ఆమె తన సినీ ప్రయాణం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది
తన సినీ ప్రయాణంలో నటన మొదలుకొని భాష, సంభాషణలు పలికే విధానం, యాస.. ఇలా ఎన్నో విషయాల్లో విమర్శలను ఎదుర్కొన్నానని, అయితే వాటి కారణంగా తాను ఏనాడు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదని రష్మిక మందన్న స్పష్టం చేసింది. విజయ్ దేవరకొండతో కలిసి ఇటీవల ‘కాఫీ విత్ కరణ్’ సీజన్ 9లో పాల్గొన్న ఆమె తన సినీ ప్రయాణం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.
ముఖ్యంగా హిందీ మాట్లాడే విధానం, దక్షిణాదియాసపై వస్తున్న విమర్శలకు గట్టిగా సమాధానమిచ్చింది. ‘నేను దక్షిణాది అమ్మాయిని. నా మాటల్లో ప్రాంతీయ యాస కనిపించడం సహజం. దానిని తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేను నటించే ప్రతి సినిమాకు డబ్బింగ్ ఆర్టిస్టులతో సంభాషణలు చెప్పించుకునే అవకాశం ఉంటుంది. కానీ నేనే డబ్బింగ్ చెప్పాలని చాలా మంది దర్శకులు కోరుతున్నారు. భిన్న భాషల్లో సొంత గొంతుతో డబ్బింగ్ చెప్పడం సవాలుతో కూడుకున్న పని. అన్ని భాషల్లో సొంతంగా డబ్బింగ్ చెప్పడం ఎంతో గర్వంగా భావిస్తున్నా’ అని రష్మిక మందన్న పేర్కొన్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

