Rashimika Mandanna | ‘నాకో రిప్లై ఇవ్వొచ్చుగా’ అని రష్మికను అడిగిన అభిమాని.. ‘గ్యాప్ లేకుండే రా’ అన్న నేషనల్ క్రష్
Rashimika Mandanna | టాలీవుడ్లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చేది రష్మిక మందన్న. ప్రస్తుతం ఈ నేషనల్ క్రష్ ‘పుష్ప 2: ది రూల్’సినిమాతో పాటు ‘రెయిన్ బో’, ‘ది గర్ల్ ఫ్రెండ్’, ‘చావా’ వంటి సినిమాలతో దూసుకుపోతుంది. అయితే తాజాగా ఈ భామ ఓ నెటిజన్‌కు ఫన్నీ రిప్లయ్ ఇచ్చింది.
Rashimika Mandanna | టాలీవుడ్లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చేది రష్మిక మందన్న. ప్రస్తుతం ఈ నేషనల్ క్రష్ ‘పుష్ప 2: ది రూల్’ సినిమాతో పాటు ‘రెయిన్ బో’, ‘ది గర్ల్ ఫ్రెండ్’, ‘చావా’ వంటి సినిమాలతో దూసుకుపోతుంది. అయితే తాజాగా ఈ భామ ఓ నెటిజన్‌కు ఫన్నీ రిప్లయ్ ఇచ్చింది.
రష్మిక మందన్న ప్రస్తుతం వరుస షూటింగ్లలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఇక షూటింగ్ గ్యాప్‌లో ఈ బ్యూటీ మిర్రర్ ముందు సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఫొటో క్షణాల్లోనే తెగ వైరల్ అయిపోయింది.
ఈ ఫొటోలను రష్మిక అభిమాని ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ.. ”మిర్రర్ సెల్ఫీ తీసుకున్నావ్.. అదే గ్యాప్ లో నాకొక రిప్లయ్ ఇవ్వొచ్చుగా” అని రష్మికను ట్యాగ్ చేశాడు. దీంతో ఈ కామెంట్ తెగ వైరల్ అయ్యంది. ఇక కామెంట్‌పై రష్మిక తాజాగా రిప్లయ్ ఇచ్చింది. ”గ్యాప్‌లో అంట.. వర్క్ గ్యాప్‌లో ఈ సెల్ఫీ తీసుకున్నారా.. సెల్ఫీ తీసుకునేటప్పుడు గ్యాప్ లేకుండే” అని స్మైల్ ఎమోజీస్‌తో రిప్లయ్ ఇచ్చింది. ఇక రష్మిక రిప్లయ్ ఇచ్చిందో లేదో.. సోషల్ మీడియా మొత్తం అది వైరల్ అయిపోయింది. రిప్లయ్ ఇచ్చిన సంగతి పక్కన పెడితే.. తను తెలుగులో రిప్లయ్ ఇవ్వడం, అదీ కూడా అచ్చ తెలంగాణ యాసలో కామెంట్ చేయడం హాట్ టాపిక్ అయిపోయింది. ఇక ఇది చూసిన నెటిజన్లు ఇది రష్మిక ఫోన్ నుంచి విజయ్ రిప్లయ్ ఇచ్చాడు అంటూ కొందరు కామెంట్ చేస్తుండగా మరికొందరు తెలుగులో బాగా మాట్లాడుతున్నావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
🤣🤣🤣🤣 gap lo anta.. work gap lo ee selfie teeskunnan ra.. 🤣🤣 selfie teeskunappudu gap lekunde 🤣
— Rashmika Mandanna (@iamRashmika) February 25, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్‌లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
SlumDog 33 Temple Road | షూటింగ్ పూర్తి చేసుకున్న పూరి- విజయ్ సేతుపతి ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్!
Unemployees | వేసిందే తక్కువ పోస్టులు.. టీజీపీఎస్సీ ఎదుట నిరుద్యోగుల ఆందోళన.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

