Rashmika Mandana | విజయ్ ఇంట్లో రష్మిక దీపావళి సెలబ్రేషన్స్.. మళ్లీ దొరికిపోయిన కన్నడ బ్యూటీ
Rashmika Mandana | చిత్రసీమలో కొన్ని కాంబినేషన్స్‌కు పునరావృత దోషం ఉండదు. ఎన్నిసార్లు చూసినా చూడముచ్చటగా అనిపిస్తాయి. అలాంటి వారిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జోడీ ఒకటి. ‘గీత గోవిందం’ సినిమాలో తొలిసారి వీరిద్దరూ కలిసి నటించారు. ఈ సినిమాతో ఈ పెయిర్ ఈ జంట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
Rashmika Mandana | చిత్రసీమలో కొన్ని కాంబినేషన్స్‌కు పునరావృత దోషం ఉండదు. ఎన్నిసార్లు చూసినా చూడముచ్చటగా అనిపిస్తాయి. అలాంటి వారిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జోడీ ఒకటి. ‘గీత గోవిందం’ సినిమాలో తొలిసారి వీరిద్దరూ కలిసి నటించారు. ఈ సినిమాతో ఈ పెయిర్ ఈ జంట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా ఇచ్చిన ఎఫెక్ట్‌తో వీరిద్దరూ మళ్లీ కలిసి డియర్ కామ్రేడ్ సినిమా చేశారు. అయితే ఈ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయినా.. వీళ్ల కెమెస్ట్రీకి మంచి మార్కులే పడ్డాయి. అయితే అన్స్క్రీన్లో ఎంత సరదాగా ఉంటారో ఆఫ్ స్క్రీన్‌లోనూ వీళ్లు చాలా సరదాగా జోకులు వేసుకుంటూ ఉంటారు.
అయితే గతకొంత కాలంగా వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్ళి కూడా చేసుకుంటారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనికి తోడు వీరిద్దరూ కలిసి ఒకే లోకేషన్లో దిగిన ఫోటోలను వేర్వేరుగా ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ ఆ వార్తలకు మరింత బలం చేకూర్చుతున్నారు. అయితే రీసెంట్గా ఈ వార్తలలో ఎలాంటి నిజాలు లేవన్నట్లు రష్మిక ప్రకటించారు. ఇదిలా ఉంటే.. తాజాగా విజయ్ దేవరకొండ తన ఇంట్లో దీపావళి వేడుకలు జరుపుకోగా.. ఈ వేడుకలకు రష్మిక వచ్చినట్లు తెలుస్తుంది. ఎందుకంటే.. విజయ్ ఫ్యామిలీ ఉన్న ఇంటి లోకేషన్‌కు.. రష్మిక ఉన్న లోకేషన్ మ్యాచ్ అవుతుంది.
Happy Diwali my loves ✨🤍 pic.twitter.com/2qE2xD9UNw
— Rashmika Mandanna (@iamRashmika) November 12, 2023
Happy Diwali my loves ❤️✨ pic.twitter.com/XaPQwRR56O
— Vijay Deverakonda (@TheDeverakonda) November 12, 2023
గతరాత్రి రష్మిక తన ఇన్‌స్టాలో హ్యాపీ దీపావళి మై లవ్స్ అంటూ చీరకట్టులో ఓ బెంచ్‌పై కూర్చున్న ఫోటోలను పంచుకుంది. రష్మిక పోస్ట్ చేసిన కొద్ది సేపటికే విజయ్ దేవరకొండ కూడా హ్యాపీ దీపావళి మై లవ్స్ అంటూ ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలను పంచుకున్నాడు. అయితే రష్మిక పోస్ట్ చేసిన ఫోటోలో బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న గోడలు.. విజయ్ ఇంటి గోడల్లాగే కనిపిస్తున్నాయి. ఇక ఇది చూసిన నెటిజన్లు ఎందుకు రష్మిక ఈ దాగుడుమూతలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

