Rashmika | ముఖానికి ట్రీట్మెంట్ చేయించుకున్న రష్మిక మందన్నా.. “మాస్క్ తీయలేను గైస్” అన్న నేషనల్ క్రష్!
Rashmika | ఇండస్ట్రీ అంటే గ్లామర్ ప్రపంచం. ఇక్కడ అందం, ఆకర్షణే కెరీర్‌ను నిర్ణయిస్తాయి. ముఖ్యంగా హీరోయిన్లకు అయితే ఇది మరింత ప్రాధాన్యం కలిగిన అంశం. అందుకే చాలా మంది నటీమణులు ఫిట్‌గా కనిపించేందుకు కఠినమైన డైట్లు, వ్యాయామం, యోగా, బ్యూటీ ట్రీట్మెంట్లు చేసుకుంటూ ఉంటారు.
Rashmika | ఇండస్ట్రీ అంటే గ్లామర్ ప్రపంచం. ఇక్కడ అందం, ఆకర్షణే కెరీర్‌ను నిర్ణయిస్తాయి. ముఖ్యంగా హీరోయిన్లకు అయితే ఇది మరింత ప్రాధాన్యం కలిగిన అంశం. అందుకే చాలా మంది నటీమణులు ఫిట్‌గా కనిపించేందుకు కఠినమైన డైట్లు, వ్యాయామం, యోగా, బ్యూటీ ట్రీట్మెంట్లు చేసుకుంటూ ఉంటారు. తాజాగా ఈ జాబితాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కూడా చేరింది. తాజాగా రష్మిక ఒక ఎయిర్‌పోర్ట్‌లో కనిపించింది. అయితే ఈసారి ఆమె ఫోటోలు కాస్తా వైరల్ అయ్యాయి , కారణం ఆమె ముఖం మీద మాస్క్. సాధారణంగా సెలబ్రిటీలు ఎయిర్‌పోర్ట్‌లో ఫోటోగ్రాఫర్ల కోసం కొద్దిసేపు మాస్క్ తీసి పోజులు ఇస్తారు. కానీ రష్మిక మాత్రం ఈసారి అలా చేయలేదు.
‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం హైదరాబాద్‌కి వచ్చిన రష్మిక ఎయిర్‌పోర్ట్‌లో కనిపించింది. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో, బ్లాక్ మాస్క్‌తో చాలా సింపుల్‌గా కనిపించింది. అక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్లు, అభిమానులు “మాస్క్ తీయండి మేడమ్, ఒక ఫోటో ప్లీజ్!” అని కోరగా, రష్మిక నవ్వుతూ .. “ఫేస్ ట్రీట్మెంట్ అయ్యింది గైస్, తీయలేను” అని సమాధానమిచ్చింది. ఆ ఒక్క మాటతో సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. “రష్మిక ముఖానికి ఏమైంది?”, “ఏ ట్రీట్మెంట్ చేయించుకుందో?”, “లిప్ ఫిల్లర్ వేసుకుందా?” అంటూ నెటిజన్లు ఊహాగానాలు మొదలుపెట్టారు. ఇటీవల రష్మిక కొత్త ఫోటోలు, వీడియోల్లో ఆమె లుక్‌లో స్వల్ప మార్పులు కనిపించాయని అభిమానులు చెబుతున్నారు. ముఖ్యంగా లిప్స్ దగ్గర కొద్దిగా ఉబ్బినట్లు కనిపిస్తోందని, బ్యూటీ ఎన్హాన్స్మెంట్ ట్రీట్మెంట్ చేయించుకుందేమో అని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.
కొంతమంది అభిమానులు అయితే .. “రష్మిక సహజంగా అందంగా ఉంటుంది. ఇలాంటి ట్రీట్మెంట్ల అవసరం లేదు”, “నేచురల్ లుక్‌నే అందం. రష్మిక మామూలుగానే చక్కగా ఉంటుంది” అని రాసుకొస్తున్నారు. అయితే మరికొందరు నెటిజన్లు మాత్రం రష్మిక వ్యక్తిగత జీవితంపై ఊహాగానాలు చేస్తున్నారు. “ఇటీవల రష్మిక, విజయ్ దేవరకొండ లవ్ రూమర్స్ ఎక్కువవుతున్నాయి. బహుశా పెళ్లికి ముందు కొత్త లుక్ కోసం ఇలా చేసుకుందేమో?” అని చెబుతున్నారు. కెరీర్ పరంగా రష్మిక చాలా బిజీగా ఉంది. తెలుగుతో పాటు హిందీలోను పలు చిత్రాలు చేస్తూ సందడి చేస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

