Rashi Khanna: ఓటీటీలో రాశీ ఖన్నా చిత్రం.. స్ట్రీమింగ్ ఎప్పటి నుండి అంటే..!

కరోనా వలన ఓటీటీకి మంచి డిమాండ్ ఏర్పడింది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు అంటూ తెగ వినోదం పంచుతున్నారు. చిన్న హీరోల సినిమాలతో పాటు పెద్ద హీరోల సినిమాలు కూడా ఇప్పుడు ఓటీటీలో విడుదల అవుతుండడం ఆశ్చర్యాన్నికలిగిస్తుంది. కొద్ది రోజుల క్రితం వెంకటేష్ నారప్ప, నాని టక్ జగదీష్ చిత్రాలు విడుదల అయ్యాయి. ఇక రీసెంట్గా నితిన్ మ్యాస్ట్రో చిత్రం కూడా ఓటీటీలోకి వచ్చేసింది.
బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా ‘అంధదూన్’ రీమేక్‌గా మాస్ట్రో తెరకెక్కగా, ఇందులో నితిన్, నభా నటేష్, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈచిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది. ఇక ఈ సినిమా మలయాళంలో కూడా తెరకెక్కుతోంది. రవి కె.చంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, కథానాయకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటించాడు. కథానాయికగా రాశి ఖన్నా నటించింది. టబు పాత్రను మమతా మోహన్ దాస్ పోషించింది.ఈ చిత్రాన్ని అక్టోబర్ 7 నుండి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ చేయబోతున్నారు.
రాశి ఖన్నా విషయానికి వస్తే ఈ అమ్మడు అరడజనుకి పైగా సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో ‘థ్యాంక్యూ’, ‘పక్కా కమర్షియల్’ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వరల్డ్ ఫేమస్ లవర్ తర్వాత గ్లామర్ డోస్ బాగా పెంచిన రాశీఖన్నా తుగ్లక్ దర్బార్, అరణ్మనై , భ్రమమ్, పక్కా కమర్షియల్, థాంక్యూ , సర్దార్, తిరుచిత్రం బలం, మేథవి, సైతాన్ కా బచ్చా సినిమాల్లో నటిస్తోంది. వీటితో తన పాత ఫాంని మళ్లీ అందిపుచ్చుకోవాలని ప్రయత్నిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- andhadun
- ott
- raashi khanna
- remake
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

