హద్దులు దాటమంటే పాత్రను వదిలేస్తా..
రాశీఖన్నా అందంగా ఉంటుంది. అలాగే మంచి నటి. అందుకే.. అన్నీ భాషల్లోనూ అవకాశాలు అందిపుచ్చుకుంటూ ముందుకెళ్తున్నది ఈ ఢిల్లీ భామ.
రాశీఖన్నా అందంగా ఉంటుంది. అలాగే మంచి నటి. అందుకే.. అన్నీ భాషల్లోనూ అవకాశాలు అందిపుచ్చుకుంటూ ముందుకెళ్తున్నది ఈ ఢిల్లీ భామ. రీసెంట్గా ‘తెలుసుకదా’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన రాశీ.. తెలుగులో ‘ఉస్తాద్ భగత్సింగ్’, తమిళంలో ‘రౌడీ అండ్ కో’, హిందీలో తాల్కోన్ మెయిన్ ఏక్, బిడ్జ్ సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా ఉంది.
సినిమాల ఎంపిక విషయంలో తాను తీసుకునే జాగ్రత్తల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరంగా చెప్పుకొచ్చింది రాశీఖన్నా. ‘తెరపై అందంగా కనిపించడానికి నేనెప్పుడూ సిద్ధమే. నటిగా అది నా ధర్మం. అందుకని కేవలం అందాన్ని మాత్రమే ప్రదర్శించే పాత్రలను నేను చేయను. నేను చేసే పాత్రల్లో నటనకు అవకాశం ఉండాలి.
కథాబలమున్న చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాను. మరో ముఖ్యమైన విష యం ఏంటంటే.. కథ డిమాండ్ చేసిందంటూ హద్దులు దాటి నటించమంటే మాత్రం ఆ పాత్రనైనా వదులుకుంటాను కానీ, అలాంటి సన్నివేశాల్లో మాత్రం నటించను. సినిమా ఒప్పుకునే ముందే ఈ విషయాలపై క్లారిటీ తీసుకొని సైన్ చేస్తా.’ అని నిర్మొహమాటంగా చెప్పింది రాశీఖన్నా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

