Mowgli Movie Making | హిట్టు కోసం కష్టపడుతున్న సుమ తనయుడు.. ‘మౌగ్లీ’ మేకింగ్ వీడియో విడుదల
Mowgli Movie | బబుల్గమ్’ (Bubblegum) అంటూ తొలి సినిమాతోనే మంచి మార్కులు సంపాదించాడు టాలీవుడ్ నటుడు రోషన్ కనకాల (Roshan Kanakala).
Mowgli Movie | బబుల్గమ్’ (Bubblegum) అంటూ తొలి సినిమాతోనే మంచి మార్కులు సంపాదించాడు టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల (Rajeev Kanakala), యాంకర్ సుమ (Anchor Suma)ల తనయుడు రోషన్ కనకాల (Roshan Kanakala). క్షణం సినిమా ఫేమ్ రవికాంత్ పేరెపు (Ravikanth Perepu) దర్శకత్వం వహించిన ఈ చిత్రం రోమాంటిక్ కామెడీగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా తర్వాత చాలా రోజుల గ్యాప్ తీసుకున్న రోషన్ తన కొత్త సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. కలర్ ఫొటో(Color Photo) వంటి బ్లాక్ బస్టర్ అందుకున్న సందీప్ రాజ్‌తో తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు రోషన్.
ఈ సినిమాకు మౌగ్లీ (Mowgli) అనే సూపర్ హీరో టైటిల్ పెట్టారు మేకర్స్. అప్పుడెప్పుడో వినాయక చవితి కానుకగా ఈ ప్రాజెక్ట్ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన చిత్రబృందం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా దర్శకుడు సందీప్ రాజ్ పుట్టినరోజు సందర్భంగా మూవీ నుంచి తాజాగా మేకింగ్ వీడియోను విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ వీడియోలో రోషన్ కనకాల హిట్టు కోసం చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వైరలవుతున్న ఈ వీడియోను మీరు చూసేయండి. ఈ సినిమాను 2025 కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి తనయుడు కాలా భైరవ సంగీతం అందిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

