Ranveer Singh | రవితేజ సినిమాపై కన్నేసిన రణ్వీర్ సింగ్?
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్, రవితేజ సినిమాపై మనసుపడ్డాడు. ఈ నేపథ్యంలో రవితేజ నటించిన ఆ బ్లాక్ బస్టర్ సినిమాను రీమేక్ చేయాలని భావిస్తున్నాడు. ఇక దర్శకత్వ బాధ్యతలు కూడా ఒరిజినల్ వెర్షన్ తెరకెక్కించిన గొపిచంద్ మలినేనినే ఇస్తున్నాడు.
Ranveer Singh Next Movie | బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఆయన నటించిన ‘రామ్‌లీల’, ‘బాజీరావు మస్తానీ’, ‘పద్మావతి’ వంటి సినిమాలు తెలుగు డబ్బింగ్ వెర్షన్లో రిలీజై ఇక్కడ కూడా మంచి విజయాలు సాధించాయి. ఇటీవలే ఆయన ‘సర్కస్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా మొదటి షో నుండి డివైడ్ టాక్ తెచ్చుకుంది. బ్రేక్ ఈవెన్ కోసం బాక్సాఫీస్ దగ్గర ఎదురీదుతుంది. ఇక రణ్వీర్ నటించిన మరో సినిమా ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహాని రిలీజ్’కు సిద్ధంగా ఉంది. కరణ్ జోహర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే రణ్వీర్ సింగ్ రీమేక్‌కు సిద్ధమైనట్లు తెలుస్తుంది. అది కూడా తెలుగు సినిమా. మాస్ మహారాజా రవితేజకు మంచి కంబ్యాక్ ఇచ్చిన ‘క్రాక్’ సినిమాను రణ్వీర్ సింగ్ రీమేక్ చేయనున్నాడట. ఒరిజినల్ వెర్షన్‌ను తెరకెక్కించిన గోపిచంద్ మలినేని రీమేక్ వెర్షన్‌ను కూడా రూపొందించనున్నాడట. ఇప్పటికే కథా చర్చలు కూడా ముగిసినట్లు టాక్. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే చాన్స్ ఉంది. ప్రస్తుతం గోపిచంద్ మలినేని బాలయ్యతో వీర సింహా రెడ్డి తెరకెక్కిస్తున్నాడు. మరో మూడు రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది. ఇక సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

