Rangabali Movie | అప్పుడే ఓటీటీలోకి రంగబలి సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Rangabali Movie On Ott | ఛలో తర్వాత ఆ రేంజ్లో టీజర్, ట్రైలర్లతో మెప్పించిన సినిమా అంటే అది రంగబలి సినిమానే. ముందు నుంచి ఈ సినిమాపై జానాల్లో మంచి ఆసక్తి నెలకొంది. పైగా ప్రమోషన్లు గట్రా బాగానే ప్లాన్ చేయడంతో జానాల్లో బాగానే రిజిస్టర్ అయింది.
Rangabali Movie On Ott | ఛలో తర్వాత ఆ రేంజ్ హిట్టు కోసం ఐదేళ్లుగా పరితపిస్తున్నాడు నాగశౌర్య. కొత్త జానర్లలో సినిమాలు ట్రై చేస్తున్న నాగశౌర్యకు అస్సలు కలిసి రావడం లేదు. ఒకటి కాదు, రెండు కాదు ఛలో తర్వాత ఏకంగా ఎనిమిది ఫ్లాపులు. మధ్యలో స్వయంగా కథ రాసుకుని తీసిన అశ్వథామ పర్వాలేదనిపించినా.. కమర్షియల్‌గా సేఫ్ కాలేకపోయింది. ఇక ఛలో తర్వాత ఆ రేంజ్లో టీజర్, ట్రైలర్లతో మెప్పించిన సినిమా అంటే అది రంగబలి సినిమానే. ముందు నుంచి ఈ సినిమాపై జానాల్లో మంచి ఆసక్తి నెలకొంది. పైగా ప్రమోషన్లు గట్రా బాగానే ప్లాన్ చేయడంతో జానాల్లో బాగానే రిజిస్టర్ అయింది.
సినిమా మీదున్న నమ్మకంతో ముందు రోజు నుంచే ఈ సినిమాకు ప్రీమియర్లు వేశారు. పైగా నాగశౌర్య సైతం ఈ సినిమా హిట్టు, సూపర్ హిట్టు కాదు ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతుందని స్టేట్మెంట్ ఇచ్చాడు. అంతేకాకుండా నిర్మాతకు కూడా ఈ సినిమా బోలెడు లాభాలు తెచ్చిపెడుతుందని చెప్పాడు. కాగా తీరా ప్రీమియర్ షో చూశాక ఆడియెన్స్ రెస్పాన్స్ నెగెటీవ్‌గా వచ్చింది. తొలిభాగం కామెడీతో గట్టెక్కిన.. మలిభాగం మాత్రం బోర్ కొట్టిచ్చిందని రివ్యూలు ఇచ్చేశారు. దాంతో ఓపెనింగ్స్‌కు పెద్ద దెబ్బ పడింది. ఇక మొదటి రోజు రివ్యూలు సైతం అనుకూలంగా రాకపోవడంతో ఫస్ట్ వీకెండ్ తిరిగేలోపే రంగబలి దుకాణం సర్దేసింది. ఎన్నో ఏళ్లుగా హిట్టు కోసం ఎదురు చూస్తున్న నాగశౌర్యకు ఈ సారి కూడా నిరాశే మిగిలింది.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా తాజాగా ఓటీటీ డేట్‌ను లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ఆగస్టు 4 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. యుక్తి తరేజా హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో మలయాళ నటుడు షైమ్ టాన్ చాకో ప్రతినాయకుడి పాత్ర పోషించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
Italy | పిల్లలు విధ్వంసానికి పాల్పడితే,తల్లిదండ్రులు పరిహారం చెల్లించాలి! ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన
Delhi Pollution | ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత జీఆర్ఏపీ-1 ఆంక్షలు అమలు
Kenya | స్వర్గం పేరుతో 190 మంది పిల్లలకు ఆకలి చావులు.. కెన్యాలో మత గురువు మూఢ బోధనలు
TGSRTC | తిరుగు ప్రయాణమూ భారమే..! ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల్లో చార్జీల మోత
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

