Rangabali | సొంతూరులో మాత్రం సింహంలా ఉండాలి.. నాగశౌర్య రంగబలి ట్రైలర్
Rangabali | టాలీవుడ్ హీరో నాగశౌర్య (Naga Shaurya) నటిస్తున్న తాజా చిత్రం రంగబలి (Rangabali). మేకర్స్ ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం ట్రైలర్ (Rangabali trailer)ను లాంఛ్ చేశారు. హీరోహీరోయిన్ల లవ్ ట్రాక్, ఫ్యామిలీ ట్రాక్‌తో సినిమా వినోదాత్మకంగా సాగనున్నట్టు ట్రైలర్‌తో చెప్పేశాడు డైరెక్టర్.
Rangabali | టాలీవుడ్ హీరో నాగశౌర్య (Naga Shaurya) నటిస్తున్న తాజా చిత్రం రంగబలి (Rangabali). పవన్ బసంశెట్టి (డెబ్యూ) డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే లాంఛ్ చేసిన రంగబలి టీజర్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. మేకర్స్ ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం ట్రైలర్ (Rangabali trailer)ను లాంఛ్ చేశారు. ప్రతీ మనిషి పేరు మీద సొంతిల్లుండకపోవచ్చు. సొంత పొలం ఉండకపోవచ్చు.. కానీ సొంతూరు మాత్రం ఉంటది.. అంటూ ఊరు ప్రాముఖ్యత గురించి చెబుతున్న డైలాగ్స్‌తో షురూ అయింది ట్రైలర్.
బయట ఊరిలో బానిసలా బతికినా ఫర్వాలేదు భయ్యా.. కానీ సొంతూరులో మాత్రం సింహంలా ఉండాలంటున్న డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. హీరోహీరోయిన్ల లవ్ ట్రాక్, ఫ్యామిలీ ట్రాక్‌తో సినిమా వినోదాత్మకంగా సాగనున్నట్టు ట్రైలర్‌తో చెప్పేశాడు డైరెక్టర్. ఇప్పటికే రంగబలి నుంచి లాంఛ్ చేసిన మన ఊరిలో ఎవడ్రా ఆపేది, కల కంటూ ఉంటే పాటలకు మంచి స్పందన వస్తోంది.
ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. రంగబలిలో సత్య, అనంత్ శ్రీరామ్, గోపరాజు రమణ, కల్యాణి నటరాజన్, శుభలేఖ సుధాకర్, మురళీ శర్మ, సప్తిగిరి, రాజ్ కుమార్ కసిరెడ్డి, భద్రం, శివనారాయణ, పీకే, పవన్, నోయెల్, రమేశ్ రెడ్డి, హరీష్ చంద్ర, బ్రహ్మాస్త్రి, ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రంగబలి చిత్రం జులై 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. నాగశౌర్య మరోవైపు నారి నారి నడుమ మురారి, పోలీస్ వారి హెచ్చరిక సినిమాల్లో కూడా నటిస్తున్నాడు.
రంగబలి ట్రైలర్..
కల కంటు ఉంటే ఫుల్ లిరికల్ వీడియో సాంగ్..
కల కంటు ఉంటే సాంగ్ ప్రోమో..
రంగబలి టీజర్..
మన ఊరిలో లిరికల్ వీడియో సాంగ్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

