Ranga Ranga Vaibhavanga Review | ‘రంగ రంగ వైభవంగా’ మూవీ రివ్యూ
Ranga Ranga Vaibhavanga Review | అన్ని కుదరాలే గాని ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ఇచ్చే ఘన విజయాలు మారే జానర్ చిత్రాలూ ఇవ్వలేవు. వీటికి మినిమమ్ గ్యారెంటీ ఉంటుంది. కలర్ ఫుల్‌గా తెరకెక్కుతాయి కాబట్టి సకుటుంబ ప్రేక్షకులు చూసేందుకు ఇష్టపడతారు. ఈ నమ్మకం పెట్టుకునే వైష్ణవ్ తేజ్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘రంగ రంగ వైభవంగా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
నటీనటులు – వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ, నవీన్ చంద్ర, నరేష్, ప్రభు, తులసి, ప్రగతి తదితరులు
సాంకేతిక నిపుణులు – సినిమాటోగ్రఫీ – శ్యామ్ దత్ సైనుద్దీన్, సంగీతం – దేవి శ్రీప్రసాద్, సమర్పణ – బాపినీడు బి, నిర్మాత – బీవీఎస్ఎన్ ప్రసాద్, దర్శకత్వం – గిరీశాయ
కథేంటంటే:
ఇరుగు పొరుగు ఇళ్లలో ఉండే రిషి (వైష్ణవ్ తేజ్), రాధ (కేతిక శర్మ) మంచి ఫ్రెండ్స్. వీళ్ల కుటుంబాలు కూడా కలిసే ఉంటాయి. చిన్నప్పటి నుంచి కలిసే పెరిగిన వీరు..స్కూల్ లో ఓ సందర్భంలో విభేదాలు వచ్చి విడిపోతారు. ఒకరితో మరొకరు మాట్లాడుకోవడం మానేస్తారు. కోపతాపాలు పైకే గానీ రిషి, రాధ మనసులో స్నేహం, ప్రేమ అలాగే ఉంటాయి. కొన్నాళ్లకు కొన్ని ఘటనల వల్ల వీరిద్దరి కుటుంబాలూ దూరమవుతాయి. ఎంతో స్నేహంగా ఉండే వారి కుటుంబాలను తిరిగి దగ్గర చేసేందుకు రాధ, రిషి ఎలాంటి ప్రయత్నం చేశారు. రిషి, రాధ ప్రేమకు రాధ సోదరుడు (నవీన్ చంద్ర) అడ్డుగా ఎందుకు నిలిచాడు, ఆ అడ్డంకులు దాటి ఈ ప్రేమ జంట ఎలా ఒక్కటయ్యారు అనేది మిగిలిన కథ.
ఫ్లస్ పాయింట్స్:
:-వైష్ణవ్ తేజ్ నటన
:-ఎంటర్ టైనింగ్ సీన్స్
:-పాటలు
మైనస్ పాయింట్స్:
:-ఊహించగలిగే కథనం
:-ఆకట్టుకోని ఎమోషన్స్
ఎలా ఉందంటే:
రంగ రంగ వైభవంగా ప్రేక్షకులకు తెలిసిన కథే. హీరో హీరోయిన్లు ఇరుగు పొరుగు ఇళ్లలో ఉండటం, వాళ్లు ఒకరంటే ఒకరికి పడక గొడవలు పడటం, తిరిగి ఒక్కటవడం..ఈ లైన్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఈ సినిమా కూడా అదే తరహాలో సాగుతుంది. అంటే దాదాపు ఇరవై ఏళ్ల కిందటి జానర్ ఇది. దీన్ని కొత్తదనం ఉన్న కథనంతో చూపించినా బాగుండేది. తెలిసిన కథ, ఊహించగలిగే కథనం వల్ల సినిమా ఎగ్జైట్ చేయదు. సక్సెస్ ఫుల్ ఫార్ములాను అంతే సక్సెస్ ఫుల్‌గా ఉపయోగించుకోలేకపోయారు దర్శకుడు గిరీశాయ.
రిషి పాత్రలో వైష్ణవ్ తేజ్ నటన ఆకట్టుకుంటుంది. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో వీలైనంత ఎనర్జిటిక్ గా నటించారాయన. లవ్ , ఎమోషన్ సీన్స్ లో మెప్పించారు వైష్ణవ్. రాధ పాత్రలో కేతిక కూడా బాగా నటించేందుకు ప్రయత్నించింది. ఇలాంటి క్యారెక్టర్ చేయడం ఆమెకు కొత్త. నరేష్, ప్రభు, ప్రగతి, తులసి..ఇలా తారాగణమంతా పాత్రోచితంగా కనిపించారు. నవీన్ చంద్ర క్యారెక్టర్ కథలో సీరియస్ నెస్ తీసుకొస్తుంది. కాన్ ప్లిక్ట్ కు కారణమవుతుంది. నవీన్ చంద్రకు ఇలాంటి క్యారెక్టర్స్ లో మెప్పించడం సులువే.
కలర్ ఫుల్ సినిమాటోగ్రఫీ, మంచి పాటలతో తెరపై అందమైన కుటుంబ వాతావరణం క్రియేట్ చేశారు. అయితే అందులోని పాత్రల భావోద్వేగాలే అసహజంగా అనిపిస్తాయి. సినిమా ప్రారంభమయ్యాక కొన్ని సన్నివేశాలు, ఇంటర్వెల్ సీన్స్ తో కథనం ఊపందుకున్నా తర్వాత అనవసర సాగతీత సీన్స్ తో నెమ్మదిస్తుంది. కథలోని సంఘర్షణకు కారణాలు, వాటి మధ్య పాత్రలు నలిగే తీరు, ఇందుకు రిలీఫ్ ఇచ్చే కొన్ని వినోద సన్నివేశాలు రాసుకుని ఉంటే ఫలితం మరోలా ఉండేది.
చివరగా…ఫర్వాలేదనిపించే ఫ్యామిలీ డ్రామా
రేటింగ్: 2.5/5.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

