బాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ కొన్నాళ్ల డేటింగ్ తర్వాత 2012లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి తైమూర్ అనే కుర్రాడు ఉండగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో మరో కుమారుడు జన్మించాడు. రీసెంట్గా ఆ చిన్నారికి జెహ్ అనే పేరు పెట్టినట్టు కరీనా తండ్రి మరియు ప్రముఖ నటుడు రణధీర్ కపూర్ పేర్కొన్నారు.
ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడిన రణధీర్ .. కరీనా మరియు సైఫ్ కుమారుడికి ఇటీవల జెహ్ అని పేరు పెట్టారు.” ఈ ఏడాది ఫిబ్రవరి 21 న కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ కుమారుడికి స్వాగతం పలకగా వారికి అభిమానులు, శ్రేయోభిలాషులు శుభాకాంక్షలుఅందించారు. వారికి మా ధన్యవాదాలు. ప్రస్తుతం తలి, బిడ్డ సురక్షితంగా ఉన్నారని రణ్‌ధీర్ చెప్పారు. కాగా, కరీనా రీసెంట్గా ప్రెగ్నెన్సీ బైబిల్ అనే పుసక్తాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చింది. తాజా పుస్తకాన్ని బయటకు తీసి ‘వేడి వేడిగా ఇప్పుడే బయటకు వచ్చింది’ .. ‘ఇది నా మూడోబిడ్డ. ఇన్నాళ్లూ దీని పనిలోనే ఉన్నా’ పుస్తకాన్ని తేవడం కూడా బిడ్డను కనడంతో సమానం అని వ్యాఖ్యానించింది.