Ramayana Trailer | ఇండియన్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ అవేటెడ్ మూవీగా నిలుస్తున్న ‘రామాయణ’ సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. నితేష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ (రాముడు), సాయి పల్లవి (సీత), రాకింగ్ స్టార్ యష్ (రావణాసురుడు) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ పౌరాణిక చిత్రం యొక్క అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ డేట్ను మేకర్స్ అనౌన్స్ చేశారు.
జూలై 24న ఈ మూవీ ట్రైలర్ను ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. వేలాది సంవత్సరాలుగా భారతదేశ సంస్కృతికి, సనాతన ధర్మానికి ప్రతీకగా నిలిచిన రామాయణాన్ని ఈ తరం ఆడియన్స్కు నచ్చేలా సరికొత్తగా చూపించబోతున్నారు. హాలీవుడ్ రేంజ్ విజువల్ ఎఫెక్ట్స్, భారీ నిర్మాణ విలువలతో నమిత్ మల్హోత్రా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ను నిర్మిస్తున్నారు. కంప్లీట్ ఇండియన్ సినిమా హిస్టరీలోనే ముందెన్నడూ చూడని విధంగా, ఊహించని రేంజ్ బడ్జెట్తో ఈ సినిమా రెడీ అవుతోంది. దేశం గర్వించే ఈ గొప్ప ఇతిహాసాన్ని వరల్డ్ వైడ్ ఆడియన్స్ ముందుకు గ్రాండ్గా తీసుకురాబోతున్నారు. కాగా, ఈ క్రేజీ మూవీ పార్ట్-1 ను ఈ ఏడాది దీపావళి కానుకగా థియేటర్లలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.