ముంబై : నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, రణ్‌బీర్ కపూర్ల (Ranbir Kapoor) యానిమల్ మూవీ టీం సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది. మూవీ ప్రమోషనల్లో భాగంగా చిత్ర బృందం సింగిల్ రియాల్టీ షో ఇండియన్ ఐడల్ 14లో సందడి చేసింది. ఈ ఈవెంట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది.
#AlluArjun
Icon Star @alluarjun Saami Saami Song Step by #AnimalMovie Team.#AlluArjun #PushpaTheRise #PushpaTheRule #Pushpa2TheRule #Pushpa2 pic.twitter.com/FzYZtWP0Qc— Allu Arjun fan ikkadaa (@AAFanIkkadaa) November 26, 2023
ఈ వీడియోలో రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా, సింగర్స్ కుమార్ సాను, శ్రేయా ఘోషల్ రష్మిక, అల్లు అర్జున్ మూవీ పుష్పలోని సామి సామి సాంగ్‌కు డ్యాన్స్ చేయడం కనిపిస్తుంది. ఓ దశలో రణ్‌బీర్ కపూర్ సాంగ్ హుక్ స్టెప్ వేసేందుకు లెజెండరీ సింగర్ కుమార్ సానుకు సహకరించడం చూడొచ్చు.
సింగర్ నడుము పట్టుకుని స్టెప్ వేయడం ప్రాక్టీస్ చేయిస్తున్న సీన్ అందరిలో నవ్వులు పూయించింది. ఇక ఇదే వీడియోలో అలియా భట్ తండ్రి మహేష్ భట్ ఓ స్పెషల్ వీడియో మెసేజ్‌లో రణ్‌బీర్‌పై ప్రశంసలు కురిపించాడు.
Read More :