Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Ranabaali | టాలీవుడ్లో ప్రస్తుతం ఆసక్తి రేకెత్తిస్తున్న చిత్రాల్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ‘రణబాలి’ ఒకటి. నిజ జీవితంలో భార్యాభర్తలైన ఈ ఇద్దరూ మరోసారి వెండితెరపై కలిసి కనిపించనుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అక్టోబర్ 16, 2026న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Ranabaali | టాలీవుడ్లో ప్రస్తుతం ఆసక్తి రేకెత్తిస్తున్న చిత్రాల్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ‘రణబాలి’ ఒకటి. నిజ జీవితంలో భార్యాభర్తలైన ఈ ఇద్దరూ మరోసారి వెండితెరపై కలిసి కనిపించనుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అక్టోబర్ 16, 2026న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు కొద్ది రోజులే మిగిలి ఉండటంతో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఈ క్రమంలో తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త తెరపైకి వచ్చింది. ‘రణబాలి’ ప్రీ రిలీజ్ వేడుకకు రష్మిక మందన్న హాజరుకానున్నట్లు సమాచారం.
ఇటీవల ‘రణబాలి’ ట్రైలర్ విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. అయితే ఈ వేడుకలో రష్మిక మందన్న కనిపించకపోవడంతో అభిమానుల్లో పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. విజయ్ దేవరకొండతో కలిసి ఆమె ఈ సినిమాలో నటిస్తున్నప్పటికీ, ట్రైలర్ వేడుకకు ఎందుకు హాజరుకాలేదనే చర్చ మొదలైంది.దీనిపై విజయ్ దేవరకొండ స్పందిస్తూ.. రష్మికకు ఇతర పనులు ఉండటంతో ట్రైలర్ కార్యక్రమానికి రాలేకపోయిందని వివరణ ఇచ్చారు. దీంతో అప్పట్లో నెలకొన్న సందేహాలకు ఆయన సమాధానమిచ్చినట్లయింది. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం, రష్మిక ప్రీ రిలీజ్ వేడుకలో మాత్రం పాల్గొననున్నారు. విజయ్‌తో పాటు చిత్రబృందంతో కలిసి ఆమె ఈ కార్యక్రమానికి హాజరవుతారని ప్రచారం జరుగుతోంది.
‘రణబాలి’ ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించనున్నారు.. రేపు సాయంత్రం జరగనున్న ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నతో పాటు చిత్రబృందం పాల్గొననుందని తెలుస్తోంది. అయితే కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలపై చిత్రబృందం అధికారిక ప్రకటనను బట్టి స్పష్టత రానుంది. విడుదలకు ముందు జరిగే ఈ వేడుక సినిమాపై అంచనాలను మరింత పెంచుతుందని నిర్మాతలు భావిస్తున్నారు. ముఖ్యంగా విజయ్, రష్మిక కలిసి వేదికపై కనిపిస్తే అభిమానులకు అది ప్రత్యేక ఆకర్షణగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ జంటకు ఉన్న క్రేజ్‌ను ప్రచార కార్యక్రమాల ద్వారా సినిమాకు మరింతగా ఉపయోగించుకోవాలని చిత్రబృందం ప్రయత్నిస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
కమీషన్ల సొమ్ము దాచుకునేందుకే ఎమ్మెల్యే కడియం విదేశీ యాత్రలు : తాటికొండ రాజయ్య
Cancer Prevention | క్యాన్సర్ నివారణ అంటే పొగ తాగడం, మద్యం మానేయడం కాదు.. వీటిని కూడా పాటించాలి..
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

