MEGA 156 | మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. దసరా సందర్భంగా ఈ చిత్రం పూజా కార్యక్రమం జరిగింది. చిరంజీవి 156 (Mega 156)వ సినిమాగా రానున్న ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన కాన్సెప్ట్ పోస్టర్‌ను ఇది వరకే విడుదల చేశారు. సోషియో ఫాంటసీ మూవీగా ఇది రానుంది. చిరు కోసం వశిష్ఠ ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించనున్నారు. కాగా ఈ చిత్రంలో విలన్ పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తారని తెలుస్తోంది.
ఇందులో పవర్ ఫుల్ విలన్ రోల్ వుంది. ఆ పాత్రకి రానా (Rana)అయితే యాప్ట్ గా ఉంటారని భావించిన మేకర్స్ ఆయన్ని సంప్రదించడం, అందుకు రానా అంగీకారం తెలపడం జరిగిందని సమాచారం. ఐతే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది. అలాగే ఇందులో అనుష్క శెట్టి, మృణాల్ ఠాకూర్ హీరోయిన్స్‌గా కనిపించే అవకాశం ఉందని సమాచారం. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఇది రూపొందనుంది. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. మ్యూజిక్ రికార్డింగ్ కూడా మొదలైయింది. ఇందులో ఆరు పాటలు ఉంటాయని చెప్పారు కీరవాణి.
MEGA 156 ప్రీ ప్రొడక్షన్ షురూ..
The Pre-production for #Mega157 begins with a bang ❤🔥
Brace yourselves for a MEGA MASS BEYOND UNIVERSE ♾️
MEGASTAR @KChiruTweets @DirVassishta @NaiduChota @UV_Creations pic.twitter.com/d488SxjxOn
— UV Creations (@UV_Creations) September 10, 2023
MEGA 156 కాన్సెప్ట్ పోస్టర్..
My heartfelt thanks to the MIGHTY MEGASTAR @KChiruTweets garu for believing me and giving me the chance to present you on BIG screens🙏🏻
Wishing the BOSS of Masses a very happy birthday!🌟
Here’s the concept poster of #MEGA157 – MEGA MASS BEYOND UNIVERSE 🔥
More details soon!… pic.twitter.com/oA0rg3g5Zn
— Vassishta (@DirVassishta) August 22, 2023