Rana naidu | వెంకటేశ్‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన రానా
దగ్గుబాటి వెంకటేశ్, రానా ప్రధాన పాత్రల్లో కలిసి నటిస్తున్న యాక్షన్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. ఈ సిరీస్ త్వరలో ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ కానుంది.
దగ్గుబాటి వెంకటేశ్, రానా ప్రధాన పాత్రల్లో కలిసి నటిస్తున్న యాక్షన్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. ఈ సిరీస్ త్వరలో ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ ప్రమోషన్స్ ప్రారంభించింది. అయితే ప్రమోషన్స్‌లో భాగంగా రానాకు, నెట్‌ఫ్లిక్స్‌కు వార్నింగ్ ఇస్తున్నట్లు ‘వెంకీమామ’ ట్విట్టర్లో సోమవారం ఓ వీడియోను షేర్ చేసిన సంగతి తెలిసిందే.
చాలా పెద్ద తప్పు చేస్తున్నావు నెట్‌ఫ్లిక్స్.. రానా నాయుడుకు ‘నాగా నాయుడు’ అని టైటిల్ పెట్టు. నాతో మజాక్‌లొద్దు.. మజాక్ మజాక్ మే అబ్దుల్ రజాక్ అవుతుంది అని నెట్‌ఫ్లిక్స్‌కి, రానాకి వార్నింగ్ ఇచ్చినట్లు ఆ వీడియోలో ఉంది. అయితే దీనిపై ‘రానా’ స్పందిస్తూ వెంకీకి స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.
రానా మాట్లాడుతూ.. ‘ట్రైలర్ లాంచ్‌కు వచ్చేయ్. నీకు గేట్ దగ్గర ఎంట్రీ దొరక్కపోతే నువ్వు రానా నాయుడు తండ్రివని చెప్పు. నీ ఎంట్రీ సంగతి రానా చూసుకుంటాడు.’ అని రానా రిప్లై ఇచ్చాడు. అయితే ఇది వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా చేయగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అమెరికన్ క్రైమ్ డ్రామా సిరీస్ ‘రే డోనవన్’ ఆధారంగా తెరకెక్కుతున్న.. ఈ వెబ్ సిరీస్ కి సుపర్ణ వర్మ, కరణ్ అన్షుమన్ దర్శకత్వం వహిస్తున్నారు.
Video toh koi bhi bana leta hai, Naga. Trailer launch par mil. Batata hu asli baap kaun hai.@VenkyMama #RanaNaidu pic.twitter.com/qveDM25zOB
— Rana Daggubati (@RanaDaggubati) February 13, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

