ఇమేజ్ పరిధి దాటి నటించా
వెంకటేష్, రానా కలిసి నటిస్తున్న వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. ఇందులో వీరు తండ్రి కొడుకుల పాత్రల్లో కనిపించనున్నారు. స్టార్లకు, సెలబ్రిటీలకు ఏ సమస్య వచ్చినా తీర్చే స్టార్ ఫిక్సర్ పాత్రలో రానా నటించగా....నేరస్థుడైన తండ్రి పాత్రను వెంకటేష్ పోషించారు.
వెంకటేష్, రానా కలిసి నటిస్తున్న వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. ఇందులో వీరు తండ్రి కొడుకుల పాత్రల్లో కనిపించనున్నారు. స్టార్లకు, సెలబ్రిటీలకు ఏ సమస్య వచ్చినా తీర్చే స్టార్ ఫిక్సర్ పాత్రలో రానా నటించగా….నేరస్థుడైన తండ్రి పాత్రను వెంకటేష్ పోషించారు. అమెరికన్ టీవీ క్రైమ్ డ్రామా సిరీస్ ‘రే డోనోవన్’ రీమేక్‌గా ఈ వెబ్ సిరీస్‌ను దర్శకులు కరణ్ అన్షుమన్, సుపర్ణ్ వర్మ తెరకెక్కించారు. ఈ నెల 10వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్కు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జరిగిన ప్రచార కార్యక్రమంలో వెంకటేష్, రానా పాల్గొన్నారు.
వెంకటేష్ మాట్లాడుతూ…‘క్యారెక్టర్ యాక్టర్స్‌ను చూసినప్పుడు వాళ్ల నుంచి స్ఫూర్తి పొందుతుంటాను. రెగ్యులర్ సినిమాల్లో చాలాకాలంగా నటిస్తున్నాను. ప్రేక్షకుల్లో నాకొక ఇమేజ్ ఉంది. దాన్ని అధిగమించి కొత్తగా ఏదైనా చేయాలి, మనకున్న హద్దులు దాటి, సవాలు విసిరే పాత్రల్లో నటించాలని అనిపిస్తుంటుంది. ఆ ప్రయత్నంలో భాగమే ఈ వెబ్ సిరీస్. కొత్తగా కనిపించే అవకాశం ఈ వెబ్ సిరీస్ ద్వారా నాకు దక్కింది. నేను గతంలో ‘కలిసుందాం రా’ అనే సినిమాలో నటించాను. కానీ ఈ కథ దానికి భిన్నంగా ఉంటుంది. కుటుంబ సభ్యులకు ఒకరితో మరొకరికి పడదు. విడిపోదాం రా అన్నట్లు ఉంటుంది.
ఈ పాత్రలో నటించడాన్ని ఆస్వాదించాను’ అన్నారు. రానా మాట్లాడుతూ…‘ పాండమిక్ తర్వాత వెబ్ సిరీస్‌ల నిర్మాణం ఇక్కడా మొదలయ్యింది. ఇది ముంబైలో ఉండే సౌతిండియన్ గ్యాంగ్‌స్టర్ కథ. ఇందులో చిన్నాన్నతో కలిసి నటించడం నేను మర్చిపోలేని అనుభూతిని అందించింది. ఈ కథలోని ఫ్యామిలీలో ఒకరితో మరొకరికి అనేక సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల మధ్య ఒక కుటుంబంగా ఎలా ఉన్నారు అనేది కొత్తగా ఉంటుంది. మన సినిమాల్లో ఇలాంటి కథలు రూపొందించడం సాధ్యం కాదు. సెలబ్రిటీ ఫిక్సర్‌గా ఎవరికి ఏ సమస్య వచ్చినా నాకు ఫోన్స్ చేస్తుంటారు. అలా పేరున్న వారి సమస్యలు తీర్చుతూ నా క్యారెక్టర్ సాగుతుంది’ అని చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

