Rana Naidu Season 2 | గెట్ రెడీ.. రానా నాయుడు సీజన్ 2 గ్లింప్స్ వీడియో
Rana Naidu Season 2 | వెంకటేశ్ (Venkatesh), రానా (Rana) కాంబినేషన్లో తెరకెక్కిన నెట్‌ఫ్లిక్స్ (Netflix) సిరీస్ రానా నాయుడు (Rana Naidu). డిజిటల్ ప్లాట్‌ఫాంలో ఈ వెబ్ ప్రాజెక్ట్‌కు మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. రానా నాయుడు ఇక సీజన్ 2తో కూడా సందడి చేయబోతుంది.
Rana Naidu Season 2 | టాలీవుడ్ (Tollywood) హీరోలు దగ్గుబాటి వెంకటేశ్ (Venkatesh), రానా (Rana) కాంబినేషన్లో తెరకెక్కిన నెట్‌ఫ్లిక్స్ (Netflix) సిరీస్ రానా నాయుడు (Rana Naidu). అమెరికన్ హిట్ సిరీస్ రే డోనోవ్యాన్‌కు అడాప్షన్గా తెరకెక్కిన ఈ ప్రాజెక్ట్ తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో విడుదలైంది. డిజిటల్ ప్లాట్‌ఫాంలో ఈ వెబ్ ప్రాజెక్ట్‌కు మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి.
తండ్రీ కొడుకులుగా నాగానాయుడు (వెంకటేశ్), రానా నాయుడు (రానా) మధ్య జరిగే హోరాహోరీ పోరు, ఇతర అంశాల చుట్టూ తిరిగే కథాంశంతో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన రానా నాయుడు ఇక సీజన్ 2తో కూడా సందడి చేయబోతుంది. నెట్‌ఫ్లిక్స్ రానా నాయుడు సీజన్ 2 గ్లింప్స్ వీడియోను విడుదల చేసింది. బాధపడకండి, మీ సమస్యలన్నీ సరిచేసేందుకు నాయుడులు తిరిగొస్తున్నారు. రానా నాయుడు సీజన్ 2 త్వరలో రాబోతోంది.. అంటూ నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసిన వీడియో నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
రానా నాయుడులో సుచిత్ర పిళ్లై, గౌరవ్ చోప్రా, సుర్వీన్ చావ్లా, ప్రియా బెనర్జీ, ఆదిత్యా మీనన్, అభిషేక్ బెనర్జీ, సుశాంత్ సింగ్, మిలింద్ పాఠక్, ఆశిష్ విద్యార్థి రానానాయుడులో కీలక పాత్రల్లో నటించారు. సీజన్ 2 మొదటి సీజన్‌ను మించి ఉండబోతుందని గ్లింప్స్ వీడియోతో అర్థమవుతోంది. ఈ వెబ్ ప్రాజెక్ట్‌లో రానా సినిమా యాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులను వారి సమస్యల నుంచి రక్షించే పాత్రలో కనిపిస్తాడని తెలిసిందే.
రానానాయుడు సీజన్ 2 గ్లింప్స్ వీడియో..
Don’t worry, the Naidus are coming back to sort out all your kiri kiri ♥🔥#RanaNaidu season 2 is coming soon! pic.twitter.com/KVJDrIB5wH
— Netflix India (@NetflixIndia) April 19, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

