Rana: రామ్ చరణ్ మరదలి పెళ్లిలో తళుక్కున మెరిసిన రానా దంపతులు

గడి కోట సంస్థానాధీశులు కామినేని అనిల్ కుమార్- శోభన రెండో కూతురు అనుష్పాల వివాహం నిన్న అంగరంగ వైభవంగా జరిగింది. దోమకొండ గడికోట వేదికగా జరిగిన అనుష్పాల పెళ్లి వేడుకకు మెగా స్టార్ ఫ్యామిలీ సైతం హజర్యయారు. ఇక రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్ కూడా హాజరైన పిక్ ఒకటి బయటకు వచ్చింది. అందులో ఈ సెలెబ్రిటీ దంపతులతో పాటు రామ్ చరణ్ కూడా ఉన్నాడు. పిక్ లో ముగ్గురూ అద్భుతంగా కన్పిస్తున్నారు.
ఉపాసన చెల్లెలు అనుష్పాల..తన ప్రియుడు అర్మాన్ ఇబ్రహీంను నిన్న వివాహం చేసుకున్నారు. పెళ్లి వేడుకలు ప్రారంభరోజు నుంచి వివాహం వరకు ప్రతి అప్డేట్.. ఫోటోలను సోషల్ మీడియాలో షేరు చేస్తున్నారు ఉపాసన. దోమకొండ కోటలో జరిగిన పోచమ్మ పండుగ.. నుంచి సంగీత్ వేడుకలు ఇలా అన్ని సందర్భాల ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. పోచమ్మ పండగ సెలబ్రెషన్స్ లో తన పెళ్లినాటి దుస్తులను రీక్రియేట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు ఉపాసన.
అనుష్పాల చెన్నైకి చెందిన కార్ రేసర్ అర్మాన్ ఇబ్రహీంని పెళ్లాడగా, అతను మాజీ ఇండియన్ ఎఫ్ 3 ఛాంపియన్ అక్బర్ ఇబ్రహీం తనయుడే . కార్ రేసర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అర్మాన్ ఇబ్రహీం తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని కార్ రేసర్ గా ప్రతిభను నిరూపించుకుని పాపులారిటీ సంపాదించాడు. ఇక అనుష్పాల అపోలో గ్రూప్ ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి.. దోమకొండ కోటకు చెందిన ఉమాపతి రావులకు మనవరాలు. శోభన- అనిల్ కామినేనిల రెండో కూతురు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్‌లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్‌పై దాడి..!
రెడ్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్‌లో అదరగొట్టిన భామ!
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
United Nations: మానవ హక్కుల నిపుణుల ఆందోళన.. ఐక్యరాజ్యసమితి వైఖరిని ఖండించిన భారత్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

