Rana Daggubati | ‘ఒరేయ్ నువ్వు చేసేది యాక్టింగ్ కాదు రా’ అని సూర్య అన్నాడు: రానా
ఈటీ (ET ) మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరుగగా.. టాలీవుడ్ యాక్టర్ రానా (Rana Daggubati)ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా వచ్చాడు. ఈ సందర్భంగా రానా, సూర్యతో స్నేహానికి సంబంధించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. గతంలో సూర్యతో జరిగిన ఓ ఫన్నీ విషయాన్ని అందరితో పంచుకున్నాడు.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) నటిస్తోన్న తాజా చిత్రం ఈటీ (ET). ఈ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. టాలీవుడ్ యాక్టర్ రానా (Rana Daggubati)ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా వచ్చాడు. ఈ సందర్భంగా రానా, సూర్య తమ స్నేహానికి సంబంధించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. గతంలో సూర్యతో జరిగిన ఓ ఫన్నీ విషయాన్ని అందరితో పంచుకున్నాడు.
సరిగ్గా పదేళ్ల క్రితం, నా సినిమాల్లో ఒక చిత్రానికి ఎడిటింగ్ చేస్తున్న స్టూడియోకు వచ్చాడు. ఆ తర్వాత నన్ను అతని కారులో ఎక్కించుకొని ఒరేయ్ నువ్వు చేసేది యాక్టింగ్ కాదు రా..సర్దేస్తున్నవ్ అంతే అని చెప్పేందుకు సుమారు 4 గంటల హైదరాబాద్ ను రౌండప్ చేయించాడు..అని చెప్పగానే పక్కనే ఉన్న సూర్య ఆ విషయాన్ని చెప్పడం ఆపేందుకు ప్రయత్నిస్తూనే…నవ్వుతూ వెంటనే రానాను హగ్ చేసుకున్నాడు. సూర్య నాకు క్లాస్ పీకిన తర్వాత భళ్లాల దేవుడిని అయ్యా, డానియల్ శేఖర్ గా నటించానని చెప్పుకొచ్చాడు. ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
😂😂😂 @Suriya_offl – @RanaDaggubati pic.twitter.com/Dsc3RJ0tPH
— Chaithu..!! (@ChaithuArts3) March 3, 2022
ఈటీలో ప్రియాంకా ఆరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్ (Sun Pictures) పై నిర్మిస్తోన్న ఈ చిత్రానికి డి ఇమ్మాన్ మ్యూజిక్ కంపోజర్. మూడేళ్ల విరామం తర్వాత సూర్య చిత్రం తొలిసారి థియేటర్లలో విడుదల కాబోతుంది. గతంలో జై భీమ్, ఆకాశం నీ హద్దురా డైరెక్ట్ ఓటీటీలో విడుదలయ్యాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

