Rana Daggubati | కొత్త దర్శకుడితో రానా నెక్ట్స్ మూవీ?.. త్వరలోనే షూటింగ్
‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ తర్వాత విరామం తీసుకున్నారు హీరో రానా. ఆయన తదుపరి సినిమా ఏంటి? అనే విషయంపై ఫిల్మ్‌వర్గాల్లో ప్రస్తుతం చర్చోపచర్చలు జరుగుతున్నాయి.
Rana Daggubati | ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ తర్వాత విరామం తీసుకున్నారు హీరో రానా. ఆయన తదుపరి సినిమా ఏంటి? అనే విషయంపై ఫిల్మ్‌వర్గాల్లో ప్రస్తుతం చర్చోపచర్చలు జరుగుతున్నాయి. తేజ దర్శకత్వంలో ‘రాక్షసరాజు’ సినిమా చేస్తున్నట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ అది పట్టాలెక్కలేదు. అలాగే గుణశేఖర్ దర్శకత్వంలో ‘హిరణ్యకశ్యప’ అనే పౌరాణిక చిత్రం కూడా అనుకున్నారు.
అది కూడా ప్రస్తుతం హోల్డ్‌లోనే ఉంది. మరి ఈ రెండిట్లో ముందు మోక్షం దేనికో! అని అందరూ ఎదురు చూస్తుంటే.. అందరి ఆలోచనలను తల్లకిందులు చేస్తూ.. ఓ కొత్త దర్శకుడి కథను రానా ఓకే చేశారట.. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు కానున్నదట. ఆర్కా మీడియా వర్క్స్ నిర్మించనున్న ఈ సినిమాకు కథానాయికగా ‘కేజీఎఫ్’ఫేం శ్రీనిధిని ఎంపిక చేసినట్టు సమాచారం. అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.
రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా డార్లింగ్
బ్లాక్బాస్టర్ ‘హను-మాన్’ని అందించిన ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ సంస్థ నుంచి రానున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘డార్లింగ్’. ప్రియదర్శి, నభానటేశ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి అశ్విన్‌రామ్ దర్శకుడు. జూలై 19న సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచారచిత్రాలకు మంచి స్పందన వస్తున్నది.
నేటి జనరేషన్‌కి కనెక్టయ్యే కంటెంట్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించేలా ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కిస్తున్నారని, తమ సంస్థలో మరో బ్లాక్బాస్టర్గా ఈ సినిమా నిలుస్తుందని నిర్మాతలు నమ్మకం వెలిబుచ్చారు. బ్రహ్మానందం, విష్ణు, కృష్ణతేజ్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి కెమెరా: నరేశ్ రామదురై, మాటలు: హేమంత్, సంగీతం: వివేక్ సాగర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Out Side Food | బయటి ఆహారం తక్కువగా తినాలి లేదా పూర్తిగా మానేయాలి.. ఎందుకో చెబుతున్న నిపుణులు..
Rajnath Singh | ముప్పు ఏ రూపంలో వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి.. సైన్యానికి రక్షణ మంత్రి పిలుపు
‘గ్రామీణ వైద్యులకు చట్టబద్ధత కల్పించే వరకు పోరాటం’
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
జాతీయ ఉత్తమ సర్పంచ్ అవార్డుకు చిత్రియాల సర్పంచ్ ఎంపిక
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

